Site icon NTV Telugu

IPL History: ఉత్కంఠభరిత మ్యాచ్‌లు.. ఐపీఎల్‌లో ‘1’ పరుగు తేడాతో గెలిచిన మ్యాచ్‌లు ఇవే..!

Ipl

Ipl

IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం క్రికెట్ లీగ్‌. ప్రతి సీజన్‌లో అభిమానులకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, అంచనాలు తలకిందులు చేసే ఫలితాలు చూడటానికి అవకాశం లభిస్తుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌లు అన్నింటికంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగించేలా నిలుస్తాయి. ఈ క్రమంలో ‘1’ పరుగుతో విజయాన్ని సాధించిన అనేక జట్లు ఉన్నాయి. ఒక పరుగుతో మ్యాచ్ గెలవడం అంటే, అది ఓ జట్టు గట్టి ప్రతిఘటనతో పాటు ఆఖరి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరాటానికి నిదర్శనం. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు కేవలం ఒక్క పరుగు తేడాతో ముగిశాయి. మరి ఆ మ్యాచ్ ల వివరాలు చూద్దామా..

Read Also: KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్‌ పరాగ్‌ మెరుపులు వృధా!

1 పరుగు తేడాతో విజయాలు సాధించిన జట్లు:
* కింగ్స్ XI పంజాబ్ (KXIP) vs ముంబై ఇండియన్స్ (MI) – 21 మే 2008, వాంఖడే స్టేడియం – కింగ్స్ XI పంజాబ్ విజయం.

* కింగ్స్ XI పంజాబ్ (KXIP) vs డెక్కన్ చార్జర్స్ – 17 మే 2009, జోహన్నెస్‌బర్గ్ – కింగ్స్ XI పంజాబ్ విజయం.

* డిల్లీ డేర్‌డెవిల్స్ (DD) vs రాజస్థాన్ రాయల్స్ (RR) – 29 ఏప్రిల్ 2012, ఢిల్లీ – డిల్లీ డేర్‌డెవిల్స్ విజయం.

* ముంబై ఇండియన్స్ (MI) vs వర్సెస్ పుణే వారియర్స్ – 3 మే 2012, పుణే – ముంబై ఇండియన్స్ విజయం.

* చెన్నై సూపర్ కింగ్స్ vs రైజింగ్ పుణే సూపర్ జెయింట్ – 21 మే 2017, హైదరాబాదులో – చెన్నై సూపర్ కింగ్స్ విజయం.

* గుజరాత్ లయన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – 12 మే 2019, హైదరాబాద్ – గుజరాత్ లయన్స్ విజయం.

* చెన్నై సూపర్ కింగ్స్ (CSK) Vs డెర్‌డెవిల్స్ – 9 ఏప్రిల్ 2015, చెన్నై – చెన్నై సూపర్ కింగ్స్ విజయం.

* గుజరాత్ లయన్స్ vs డెర్‌డెవిల్స్ – 27 ఏప్రిల్ 2016, ఢిల్లీ – గుజరాత్ లయన్స్ విజయం.

Read Also: Hit3 : తలకు బలమైన దెబ్బ.. అయినా షూటింగ్ ఆపని నాని..

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs కింగ్స్ XI పంజాబ్ – 9 మే 2016, మొహాలి – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.

* ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ – 21 మే 2017, హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ విజయం.

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ – 21 ఏప్రిల్ 2019, బెంగళూరు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.

* ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – హైదరాబాద్ 12 మే 2019 – ముంబై ఇండియన్స్ విజయం.

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) – 27 ఏప్రిల్ 2021, అహ్మదాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం.

* లక్నో సూపర్ జెయింట్స్ (LSG) vs వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) – 20 మే 2023, ఈడెన్ గార్డెన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ విజయం.

* కోల్కతా నైట్ రైడర్స్ (KKR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 21 ఏప్రిల్ 2024, ఈడెన్ గార్డెన్స్ – కోల్కతా నైట్ రైడర్స్ విజయం.

* సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ – 2 మే 2024, హైదరాబాద్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం.

* కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (RR) – 4 మే 2025, ఈడెన్ గార్డెన్స్ – కోల్కతా నైట్ రైడర్స్ విజయం.

ఈ మ్యాచ్‌లన్నీ చివరి బంతివరకు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఐపీఎల్‌లో అలాంటి అరుదైన విజయాలు సాధించిన జట్ల జాబితా క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

Exit mobile version