NTV Telugu Site icon

RCB vs DC: చావో.. రేవో.. ప్లేఆప్స్ కు చేరువయ్యేది ఎవరో..

Rcb Vs Dc

Rcb Vs Dc

మే 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ లలో 5 గెలిచింది, ఇప్పుడు ప్లేఆఫ్‌ లకు అర్హత సాధించడానికి అవకాశం పొందడానికి తదుపరి 2 గేమ్‌ లను తప్పక గెలవాలి. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి చివరి 5 మ్యాచ్ లలో 4 బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ లను గెలుచుకుంది.

Also Read: Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..

ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 12 మ్యాచ్‌ లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. రిషబ్ పంత్‌కు కూడా ఇది తప్పక గెలవాల్సిన గేమ్. కాకపోతే నిషేధం వల్ల పంత్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఇక ఈ రెండు టీమ్స్ బెంగళూరు, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్12 గెలిచింది. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధిక స్కోరు 215. బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక స్కోరు 196.

Also Read: CSK vs RR: రాజస్థాన్ తో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరు.. గెలిస్తేనే ప్లేఆఫ్స్..!

ఇక నేటి మ్యాచ్ లో ఆడబోయే ఆటగాళ్ల వివరాలు చూస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్ లు అంచనా వేయొచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, మయాంక్ డాగర్, వైషక్ విజయ్కుమార్, యశ్ దయాల్ లు ఉన్నారు.

ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ లో జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), త్రిస్తాన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ లను అంచనా వేయవచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ గా రసిఖ్ సలాం, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, కుమార్ కుశాగ్ర, సుమిత్ కుమార్ లు ఉన్నారు.