NTV Telugu Site icon

KKR Captain: కేకేఆర్ కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా టీమిండియా నయా సంచలనం!

Kkr Won

Kkr Won

ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రాంచైజీ ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌ను టాప్ ప్లేయర్‌గా రూ.13 కోట్లకు అట్టిపెట్టుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, డేంజరస్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌లను రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. భారత ప్లేయర్స్ హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను రూ.4 కోట్లుకు అట్టిపెట్టుకుంది. కేకేఆర్ రూ.63 కోట్లతో వేలంలోకి వెళ్లనుంది.

2024 ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. కేకేఆర్‌ రిటెన్షన్‌కు శ్రేయస్ ఒప్పుకోలేదని సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ సూచనలతోనే కోల్‌కతాను వీడినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ స్థానంలో మరోసారి ఢిల్లీకి శ్రేయస్ సారథిగా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శ్రేయస్ జట్టును వీడడంతో కోల్‌కతాకు కెప్టెన్ అవసరం ఏర్పడింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలంలో ఉన్నా.. వీరిద్దరూ కోల్‌కతాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంజాబ్ కింగ్స్‌కు పంత్.. ఆర్‌సీబీకి కేఎల్ రాహుల్ వెళ్లే ఛాన్స్ ఉంది.

Also Read: Delhi AQI: ఢిల్లీలో 400 దాటిన ఏక్యూఐ.. అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు!

ప్రస్తుతం కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు కోల్‌కతాకు లేకుండా పోయారు. దాంతో జట్టులో ఉన్న రింకూ సింగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు చేస్తోందని తెలిసింది. రింకూకు ఇప్పటివరకు కెప్టెన్సీ అనుభవం లేదు. కనీసం దేశవాళీ క్రికెట్‌లో కూడా సారథిగా వ్యవహరించలేదు. అలాంటి రింకూ డిపెండింగ్ ఛాంపియన్ జట్టును ముందుకు తీసుకెళ్లడం కత్తిమీద సామే అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

Show comments