IPL Auction 2025 Live: ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.
-
ముంబైకి విఘ్నేష్ పుత్తూరు, ఆర్ఆర్‌కు అశోక్ శర్మ..
విఘ్నేష్ పుత్తూరును రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అశోక్ శర్మను రూ. 30 లక్షలకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.
-
ఆర్సీబీకి లుంగి ఎంగిడి..
దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడిని రూ. కోటికి ఆర్‌సిబి దక్కించుకుంది. అభినందన్ సింగ్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
-
ఆర్ఆర్‌కి కునాల్ రాథోడ్, ముంబైకి అర్జున్ టెండుల్కర్
కునాల్ రాథోడ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అర్జున్ టెండూల్కర్‌ను రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. లిజాడ్ విలియమ్స్‌ను కూడా రూ. 75 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కుల్వంత్ ఖేజ్రోలియాను గుజరాత్ టైటాన్స్ రూ. 30 లక్షలకు దక్కించుకుంది.
-
ఢిల్లీకి త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ
త్రిపురాన విజయ్‌ను రూ. 30 లక్షల బేస్ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. మాధవ్ తివారీకి రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్నారు.
-
గుజరాత్ టైటాన్స్‌కు కరీం జనత్, బెవోన్ జాకబ్స్ ముంబైకు
కరీం జనత్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. బెవోన్ జాకబ్స్‌ను రూ. 30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.
-
ఢిల్లీకి మన్వంత్ కుమార్..
మన్వంత్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
-
అన్‌సోల్డ్‌గా నిలిచిన యువ ఆటగాళ్లు..
కుల్వంత్ ఖేజ్రోలియా, శివాలిక్ శర్మ, సందీప్ వారియర్, తేజస్వి దహియా, రాజ్ లింబానీ అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా నిలిచారు.
-
అన్‌సోల్డ్ ఆటగాళ్లు..
ల్యూస్ డు ప్లూయ్, మాథ్యూ షార్ట్ అన్‌సోల్డ్ ఆటగాళ్లుగా విదేశీయులు ఉండగా.. శివాలిక్ శర్మ అన్‌సోల్డ్‌గా నిలిచారు.
-
క్వేనా మఫాకాను సొంతం చేసుకున్న ఆర్ఆర్..
దక్షిణాఫ్రికా పేసర్ క్వేనా మఫాకాను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇతని కోసం ముంబై, ఆర్ఆర్ పోటీ పడ్డాయి. చివరకు రూ. 1.50 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
-
అన్‌సోల్డ్‌గా నిలిచిన విదేశీ ఆటగాళ్లు..
బ్రాండన్ కింగ్, గుస్ అట్కిన్సన్, సికందర్ రజా, టామ్ లాథమ్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
-
LSGకి మాథ్యూ బ్రీట్జ్కే
మాథ్యూ బ్రీట్జ్కేను లక్నో రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.
-
అన్‌సోల్డ్‌గా నిలిచిన ఆటగాళ్లు..
తనుష్ కోటియన్, LR చేతన్, మురుగన్ అశ్విన్ అన్‌సోల్డ్‌గా ఉన్నారు.
-
యువ ఆటగాళ్లు ఏ జట్లకు వెళ్లారంటే..?
ఆండ్రీ సిద్దార్థ్‌ను బేస్ ధర రూ.30 లక్షలకు చెన్నై కొనుగోలు చేసింది. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అర్షిన్ కులకర్ణిని కూడా రూ. 30 లక్షలకు లక్నో కొనుగోలు చేసింది.
-
మొయిన్ అలీని దక్కించుకున్న కేకేఆర్..
మొయిన్ అలీని కోల్ కతా రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఉమ్రాన్ మాలిక్‌ను కూడా రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. సచిన్ బేబీని సన్ రైజర్స్ రూ. 30 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.
-
అమ్ముడుపోని యువ ఆటగాళ్లు..
పుఖ్‌రాజ్ మాన్, హార్విక్ దేశాయ్, ప్రిన్స్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, ప్రశాంత్ సోలంకి, డెవాల్డ్ బ్రెవిస్ మెగా వేలంలో అన్ సోల్డ్‌గా నిలిచారు.
-
స్వస్తిక్ ఆర్సీబీకి.. కేకేఆర్‌కు అనుకుల్
స్వస్తిక్ చికారాను ఆర్సీబీ రూ. 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అనుకుల్ రాయ్‌ను కోల్‌కతా రూ. 40 లక్షలకు సొంతం చేసుకుంది. వంశ్ బేడీని రూ. 55 లక్షలకు చెన్నై దక్కించుకుంది.
-
ఢిల్లీకి డోనోవన్ ఫెర్రీరా..
డోనోవన్ ఫెర్రీరాను రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని షార్దుల్ ఠాకూర్
షార్దుల్ ఠాకూర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
-
కేకేఆర్‌లోకి అజింక్య రహానె..
అజింక్య రహానెను రూ. 2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
-
రూ.2 కోట్లకు అమ్ముడుపోయిన గ్లెన్ ఫిలిప్స్..
గ్లెన్ ఫిలిప్స్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
-
కేకేఆర్‌కు లువ్నిత్ సిసోడియా.. సీఎస్కేకు శ్రేయాస్ గోపాల్
లువ్నిత్ సిసోడియాను కేకేఆర్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. శ్రేయాస్ గోపాల్‌ను రూ.30 లక్షలకు సీఎస్కే కొనుగోలు చేసింది.
-
అన్‌సోల్డ్‌గా వార్నర్..
డేవిడ్ వార్నర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, పీయూష్ చావ్లా, మయాంక్ అగర్వాల్ మెగా వేలంలో అమ్ముడుపోలేదు.
-
ఆర్సీబీకి దేవదత్ పడిక్కల్..
మొదటిసారి వేలంలో అమ్ముడుపోకపోవడంతో.. మళ్లీ తిరిగి బిడ్ నిర్వహించారు. ఈ క్రమంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతన్ని జట్టులోకి తీసుకుంది. రూ. 2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
-
SRHకి ఎషాన్ మలింగ..
ఎషాన్ మలింగ బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. అతని కోసం రాజస్థాన్, సన్ రైజర్స్ పోటీ పడ్డాయి. చివరికి హైదరాబాద్ రూ. 1.2 కోట్లకు సొంతం చేసుకుంది.
-
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 1.1 కోట్లు..
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. అతని కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకు రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
-
అమ్ముడుపోని విదేశీ ఆటగాళ్లు..
డ్వైన్ ప్రిటోరియస్, బ్లెస్సింగ్ ముజారబానీ, రోస్టన్ చేజ్, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్ అమ్ముడుపోలేదు.
-
అమ్ముడుపోని యువ ఆటగాళ్లు..
రాజ్ లింబాని, అన్షుమాన్ హుడా అమ్ముడుపోలేదు.
-
ముంబైకి సత్యనారాయణ రాజు, సీఎస్కేకు రామకృష్ణ ఘోష్..
రామకృష్ణ ఘోష్ ను రూ. 30 లక్షలకు చెన్నై దక్కించుకుంది. సత్యనారయణ రాజును రూ. 30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.
-
లక్నోకు యువరాజ్ చౌదరి, పంజాబ్‌కు పైలా అవినాష్..
యువరాజ్ చౌదరిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. రూ. 30 లక్షలకు పైలా అవినాష్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
సీఎస్కేకు కమలేష్ నాగర్ కోటి..
కమలేష్ నాగర్‌కోటిని రూ. 30 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని దేశీయ ఆటగాళ్లు..
చేతన్ సకారియా, సందీప్ వారియర్, అబ్దుల్ బాసిత్, తేజస్వి దహియా ఆటగాళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు.
-
పంజాబ్ కు జేవియర్ బార్ట్‌లెట్..
జేవియర్ బార్ట్‌లెట్ ను రూ. 80 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
జామీ ఓవర్టన్ 1.50 కోట్లకు సీఎస్కే కొనుగోలు..
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జామీ ఓవర్టన్ రూ. 1.50 కోట్ల బేస్ ధరకు చెన్నై కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని విదేశీ ఆటగాళ్లు..
మైఖేల్ బ్రేస్‌వెల్, ఒట్నీల్ బార్ట్‌మాన్, దిల్షన్ మధుశంక, ఆడమ్ మిల్నే, లుంగీ ఎంగిడి, విలియం ఓ'రూర్కీ, లాన్స్ నోరిస్, ఆలీ స్టోన్ ఆటగాళ్లు మెగా వేలంలో అమ్ముడుపోలేదు.
-
లక్నోకు ప్రిన్స్ యాదవ్..
ప్రిన్స్ యాదవ్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
-
పంజాబ్‌కు ముషీర్ ఖాన్..
ముషీర్ ఖాన్‌ను రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని ఆటగాళ్లు..
బరాజ్ వర్మ, ఎమాన్‌జోత్ చాహల్, కుల్వంత్ కేజ్రోలియా, దేవేష్ శర్మ, నమన్ తివారీ అమ్ముడుపోలేదు.
-
SRHకి అనికేత్ వర్మన్..
అనికేత్ వర్మన్ సన్ రైజర్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని శివమ్ మావి, నవదీప్ సైనీ..
శివమ్ మావి, నవదీప్ సైనీ, సల్మాన్ నిజార్ అమ్ముడుపోలేదు.
-
సీఎస్కేకు నాథన్ ఎలిస్..
నాథన్ ఎలిస్ రూ.2 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఆర్టీఎం ద్వారా రూ. 75 లక్షలకు సొంతం చేసుకున్న లక్నో.
-
బేస్ ప్రైస్‌కు దుష్మంత చమీర..
దుష్మంత చమీరను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.
-
SRHకి కమిందు మెండిస్..
శ్రీలంక బ్యాటింగ్ ఆల్ రౌండర్ కమిందు మెండిస్ తన బేస్ ధర రూ. 75 లక్షలకు SRH దక్కించుకుంది.
-
అమ్ముడుపోని ఆటగాళ్లు..
కైల్ మేయర్స్, సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్, జాకబ్ బెహెరెన్‌డ్రాఫ్ అమ్ముడుపోలేదు.
-
పంజాబ్ కింగ్స్‌కు ఆరోన్ హార్డీ..
రూ. 1.25 కోట్ల బేస్ ధరకు ఆరోన్ హార్డీని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
-
ఆర్సీబీకి జాకబ్ బెథెల్.. కోటికి బ్రైడాన్ కార్స్
జాకబ్ బెథెల్‌ను ఆర్సీబీ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక కోటికి బ్రైడాన్ కార్స్‌ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోయిన యువ ఆటగాళ్లు..
విప్రజ్ నిగమ్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. శ్రీజిత్ కృష్ణన్‌ను రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.
-
ప్రియాంష్ ఆర్యకు 3.80 కోట్లు..
ప్రియాంష్ ఆర్యను రూ. 3.80 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన ప్రియాంష్ ఆర్య కోసం.. ఆర్సీబీ, పంజాబ్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అలాగే.. మనోజ్ భాండాగే ఆర్సీబీకి వెళ్లాడు. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
-
MIకి రీస్ టాప్లీ..
రీస్ టోప్లీని రూ. 75 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆర్సీబీ ఆర్టీఎం పద్దతిలో అవసరం లేదని చెప్పింది.
-
80 లక్షలకు అమ్ముడుపోయిన కుల్దీప్ సేన్..
కుల్దీప్ సేన్ 80 లక్షలకు అమ్ముడు పోయాడు. పంజాబ్ కింగ్స్ అతనిని కొనుగోలు చేసింది.
-
అమ్ముడుపోని విదేశీ ఆటగాళ్లు..
అల్జారీ జోసెఫ్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకాను కొనుగోలు చేయలేదు.