NTV Telugu Site icon

IPL 2025: సారీ.. ఎస్ఆర్‌హెచ్‌ను వదిలేస్తున్నా: డేల్ స్టెయిన్‌

Dale Steyn Srh

Dale Steyn Srh

Dale Steyn departure from Sunrisers Hyderabad: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ కీలక ప్రకటన చేశాడు. బౌలింగ్ కోచ్‌గా తాను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌)ను వీడుతున్నట్లు తెలిపాడు. అయితే సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌ కేప్‌కు మాత్రం బౌలింగ్‌ కోచ్‌గా కొనసాగుతానని వెల్లడించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన స్టెయిన్‌.. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు.

‘క్రికెట్ అనౌన్స్‌మెంట్.. గత కొన్నేళ్లుగా బౌలింగ్‌ కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2025లో ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి పనిచేయలేకపోతున్నా. కానీ సౌతాఫ్రికా 20 లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో పనిచేస్తా. ఎస్‌ఏ 20 లీగ్‌లో మేం హ్యాట్రిక్‌ కొడతాం అన్న నమ్మకం ఉంది’ అని డేల్‌ స్టెయిన్‌ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. కోచ్‌గానే కాకుండా సన్‌రైజర్స్ జట్టుకూ స్టెయిన్‌ ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ టైటిల్‌ విజేతగా నిలవడంతో, 2018లో ఫైనల్స్‌కు వెళ్లడంలో అతడిది కీలక పాత్ర.

Also Read: IND vs NZ: 46 పరుగులకే ఆలౌట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు!

ఐపీఎల్ 2024లో డేల్‌ స్టెయిన్‌ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాక్లిన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్మెంట్ తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. ఇప్పుడు స్టెయిన్‌ పూర్తిగా తప్పుకోవడంతో.. ఫ్రాక్లిన్‌కే పూర్తిస్థాయి పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హెన్రిచ్‌ క్లాసెన్‌, పాట్ కమిన్స్‌, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిని అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది.