Site icon NTV Telugu

IPL 2024 Auction: టాప్‌ ప్లేయర్లకు నిరాశే.. ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే!

Ipl 2024

Ipl 2024

Unsold Players In IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌ కోసం దుబాయ్‌ వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ రికార్డు స్థాయి ధర పలికాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురవగా.. మరికొందరు స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.

ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ హెడ్‌ కోచ్‌ టామ్ మూడీ జోస్యం నిజమైంది. జోష్‌ హేజిల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, సీన్ అబాట్, బెన్ డకెట్, జేమ్స్ నీషమ్, జేసన్ హోల్డర్, టిమ్ సౌథీ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.

Also Read: IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్‌ స్టార్క్‌

అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే:
స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
వాండర్ డసెన్‌ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్‌ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
కొలీన్‌ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు)
క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
డానియల్ సామ్స్‌ (కనీస ధర రూ.1.50 కోట్లు)
ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)

Exit mobile version