Site icon NTV Telugu

RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

Srhvsrcb

Srhvsrcb

RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ శనివారం (మార్చి 28) ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి దృష్టి ఉంటుంది. యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి సైతం పరీక్ష ఎదురుకానుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా, ఆరంభ మ్యాచ్‌లలో ఇషాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. ఈ రెండు టీమ్‌లలో స్టార్ పేసర్లు పలు కారణాల వల్ల దూరమయ్యారు. దీంతో మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇది బ్యాటర్లకు కలిసి రానుంది.

READ MORE: Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్‌ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!

గత సీజన్ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంకా జట్టుతో చేరలేదు. యశ్ దయాల్ సైతం పలు కారణాల వల్ల సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ ఒక్కరే మిగిలారు. కొత్తగా జట్టులోకి వచ్చిన జాకబ్ డఫీ, యువ పేసర్లు మంగేష్ యాదవ్, రాసిఖ్ సలామ్‌లు పటిష్టమైన సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడం కష్టమని నిపుణుల అంచనా. మరోవైపు.. సన్‌రైజర్స్ పరిస్థితి చూస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, హర్షల్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వంటి విధ్వంసకర బ్యాటర్లను వీరు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏం జరగుతుందో చూద్దాం.. \

READ MORE: Nepal Political Crisis: నేపాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అరెస్ట్స్.. మాజీ ప్రధాని ఓలీ, మాజీ హోం మంత్రి అరెస్ట్!

Exit mobile version