IPL 2026: ఆర్సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!
- నేడే తొలి పోరు..
- డిఫెండింగ్ ఛాంపియన్‌గా రజత్ సేన..
- ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs SRH IPL 2026 Opener: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది.
READ ALSO: Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!
Also Read
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
ఆర్సీబీలో బ్యాటింగ్ జోష్.. బౌలింగ్ టెన్షన్..
గతేడాది తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ, రజత్ పాటిదార్ సారథ్యంలో ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఈసారి బరిలోకి దిగబోతుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జిత్ శర్మ, ట్రీమ్ డేవిడ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో యశ్ దయాల్ దూరం కావడం, ఫిట్‌నెస్ సమస్యతో జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. చిన్నస్వామి వంటి బ్యాటింగ్ పిచ్‌పై ఈ బలహీనతను ఆర్సీబీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్..
రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయపడటంతో ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలను ఇషాన్ కిషన్ చేపట్టారు. ఇదే సమయంలో కమిన్స్ స్థానంలో ఇంగ్లీష్ పేసర్ బ్రైడన్ కార్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిమిత బౌలింగ్ వనరులతో ఆర్సీబీ వంటి భారీ బ్యాటింగ్ లైనప్‌ను ఇషాన్ ఎలా అడ్డుకుంటాడన్నది ఇప్పుడు అభిమానులకు చాలా ఆసక్తికరంగా మారింది.
తుది జట్టు (అంచనా):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రసిక్ సలామ్ దార్.
ఇంపాక్ట్ సబ్: వెంకటేష్ అయ్యర్ / సుయాష్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ.
ఇంపాక్ట్ సబ్: శివం మావి / హర్ష్ దూబే.
The countdown to the first ball is on ⏳
🎥 @RCBTweets and @SunRisers are all set for the #TATAIPL 2026 season opener 👊#RCBvSRH pic.twitter.com/8CHJBoGceB
— IndianPremierLeague (@IPL) March 27, 2026
తాజావార్తలు
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!