IPL 2026: ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలం నేడు (డిసెంబర్ 16) అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలకు 77 స్లాట్లు అందుబాటులో ఉండగా, 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ, విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు “హాట్ కేకుల్లా” మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఒక లుక్ వేద్దామా..
Mother Sells Own Son: సొంత కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి.. తండ్రి ఆవేదన..!
ఈ లిస్ట్ లో మొదటగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశముందని అంచనా. గ్రీన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 153.69 స్ట్రైక్ రేట్‌తో 707 పరుగులు చేయడంతో పాటు, బంతితో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ కూడా జట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2024 సీజన్‌లో 234కు పైగా స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేసిన ఈ యువ బ్యాట్స్‌మన్, పవర్‌ప్లేలో దూకుడైన ఆటగాడిగా పేరు ఉంది. అలాగే న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ టీ20ల్లో నమ్మకమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ 145కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసే ఫినిషర్‌గా జట్లకు కీలక ఆస్తిగా మారే అవకాశం ఉంది. శ్రీలంక పేసర్ మతీష పతిరాన 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 19 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్… విశాఖలో మంత్రి లోకేష్ కీలక పర్యటన
ఇదిలా ఉండగా.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కేటగిరీ కూడా ఈ వేలంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 350 మందిలో 238 మంది (వారిలో 14 మంది విదేశీ ఆటగాళ్లు) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ, రాజస్థాన్ పేసర్ అశోక్ శర్మ, 19 ఏళ్ల వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ కార్తీక్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్, పంజాబ్ వికెట్‌కీపర్ సలీల్ అరోరా వంటి యువకులు ఉన్నారు. వీరంతా తమ ప్రదర్శనలతో ఫ్రాంచైజీలను ఆకట్టుకునే స్థాయిలో ఉన్నారు. మొత్తంగా, ఐపీఎల్ 2026 మినీ వేలం యువ ప్రతిభకు వేదికగా మారనుంది. అనుభవజ్ఞులతో పాటు కొత్త ముఖాలపై జట్లు ఎంతవరకు నమ్మకం పెట్టుకుంటాయో, ఎవరు ఎవరి జట్టుకు దక్కుతారో అన్న ఉత్కంఠతో క్రికెట్ అభిమానులు ఈ వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
