IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: అతిపెద్ద క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 19వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాట్స్మెన్ల పరుగుల దాహానికి, బౌలర్ల వికెట్ల వేటకు మైదానలు సిద్ధమౌతున్నాయి. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరిగే పోరుతో ఈ లీగ్ అట్టహాసంగా మొదలుకానుంది. అయితే, ఈ సీజన్లో కొందరు స్టార్ ప్లేయర్లకు వీడ్కోలు సీజన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిగ్గజ ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: Iran-Israel War: హార్ముజ్ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
వయస్సు, ఫిట్నెస్, భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా ఐపీఎల్ 2026 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న ఆ ఐదుగురు ఆటగాళ్లు వీరే అని విశ్లేషకులు చెబుతున్నారు. వారేవరో చదివేయండి..
1. మహేంద్ర సింగ్ ధోని
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో ఉన్న మాహీ, మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, సీఎస్కే కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. జూలైలో ఆయనకు 45 ఏళ్లు నిండనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోని ఈ సీజన్ మొత్తం ఆడతారని ధృవీకరించినప్పటికీ, మాహీకి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కాబోతుందని చెబుతున్నారు. ఇదే నిజం అయితే అభిమానులకు ఇది ఒక భావోద్వేగభరితమైన వీడ్కోలు కానుంది.
2. సునీల్ నరైన్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు వెన్నెముక సునీల్ నరైన్. బౌలింగ్‌లో 192 వికెట్లు, బ్యాటింగ్‌లో 1,780 పరుగులతో అల్-రౌండ్ ప్రదర్శన ఇస్తున్న ఈ స్టార్ వయస్సు ప్రస్తుతం 37 ఏళ్లు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన, పెరుగుతున్న ఫిట్నెస్ సవాళ్ల దృష్ట్యా ఈ ఐపీఎల్ తర్వాత లీగ్ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
3. ఇషాంత్ శర్మ
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) తరఫున ఆడుతున్నారు. 37 ఏళ్ల ఇషాంత్ గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. యువ ఫాస్ట్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో, ఐపీఎల్ 2026 తన కెరీర్లో ఆఖరి మెరుపు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
4. అజింక్య రహానే
సాంకేతికంగా అత్యంత పటిష్టమైన బ్యాటర్ అజింక్య రహానేకు కూడా ఇదే ఆఖరి సీజన్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడుతున్న రహానే, ఈ సీజన్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జూన్‌లో 38వ పడిలోకి అడుగుపెట్టనున్న రహానే, ఈ లీగ్ తర్వాత కుర్రాళ్లకు దారి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
5. మిచెల్ స్టార్క్
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో ఉన్నారు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన స్టార్క్, టెస్ట్, వన్డే కెరీర్‌ను పొడిగించుకోవడానికి ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పనిభారం తగ్గించుకోవడంలో భాగంగా ఈ సీజన్ తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ చివరి సీజన్‌ను టైటిల్ విజయంతో ముగించాలని పట్టుదలతో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ట్రోఫీతో వీడ్కోలు పలుకుతారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..