IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానేకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానే అనుభవం జట్టుకు అవసరమని యాజమాన్యం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. “రహానె మాకు బెస్ట్ ఛాయిస్. అతడి అనుభవం జట్టుకు ఎంతో కీలకం. ఫ్రాంచైజీ ఇప్పటికే దీనిపై ఒక స్పష్టతకు వచ్చింది” అని కేకేఆర్ వర్గాలు వెల్లడించాయి.
READ ALSO: Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీలకు హాఫ్ డే స్కూల్స్
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
గత సీజన్లో 37 ఏళ్ల రహానే బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు. 13 మ్యాచుల్లో 390 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈసారి కూడా అతను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈసారి వేలంలో కేకేఆర్ అత్యంత ప్రమాదకరమైన విదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. కివీస్ స్టార్ ప్లేయర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్రలతో పాటు ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే జట్టులో సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, మతీశా పతిరన, బ్లెస్సింగ్ ముజరబాని వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద సవాల్‌గా మారింది. కేకేఆర్ జట్టు కీలక బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అతను దూరమైతే, అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?