Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!
- సోషల్ మీడియాలో గోయెంకా ప్రవర్తనపై ట్రోల్స్ వెల్లువ
- 2024లో KL రాహుల్ రాహుల్ తో జరిగిన పాత ఘటన మళ్లీ వైరల్
- “ఒక్క మ్యాచ్‌కే అంత రియాక్షన్ అవసరం లేదు”- మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ వ్యాఖ్య..
- ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తీవ్ర వ్యాఖ్యలు
- గోయెంకాను “లూజర్, జోకర్”గా విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalit Modi: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో గ్రౌండ్ లోనే చర్చించడం మరోసారి క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. మైదానంలో గోయెంకా పంత్ తో మాట్లాడటం చూస్తుంటే, ఆయన అసహనంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ మొదలయ్యాయి.
గతంలో 2024 సీజన్‌లో అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ తో కూడా గోయెంకా ఇలాగే ప్రవర్తించిన వీడియో తెగ వైరల్ కావడంతో, నెటిజన్లు ఇప్పుడు ఆ పాత ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోపై X వేదికగా “టోర్నమెంట్ మొదలై ఒక్క మ్యాచ్ మాత్రమే అయ్యింది.. దీనికి అంత అవసరం లేదు” అని మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ పేర్కొన్నారు.
Also Read
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!
ఇక దీనికి ప్రతిస్పందనగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజీవ్ గోయెంకాను “లూజర్, జోకర్” అని సంబోధిస్తూ.. ఒకవేళ తాను ఐపీఎల్ చైర్మన్ గా ఇపుడు ఉండి ఉంటే అతనిపై శాశ్వత నిషేధం విధించి.. ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకునేవాడినని మండిపడ్డారు. అంతేకాకుండా బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకుని గోయెంకాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
I told you this guy @DrSanjivGoenka owner of @LucknowIPL is a complete looser and joker of the highest order – i am seriously embarrassed with his behaviour. I created the @IPL for fans and players alike. Not for this to happen every time every year. If I was still Chairman and… https://t.co/5mHzg8RAY1
— Lalit Kumar Modi (@LalitKModi) April 2, 2026
ఈ వ్యవహారం ముదురుతుండటంతో లక్నో ఫ్రాంచైజీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగా “మీరు చూసేవన్నీ నిజం కాకపోవచ్చు.. కెమెరాలు కట్ అయిన తర్వాత ఉండే అసలైన వాతావరణం ఇది” అంటూ మరో కోణంలో తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో గోయెంకా, పంత్ మధ్య వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. గోయెంకా, పంత్ మధ్య ఉన్నది కేవలం స్నేహపూర్వక చర్చ మాత్రమేనని జట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!
ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే సంజీవ్ గోయెంకా రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచారు. “సీజన్ ఇంకా చాలా ఉంది.. ఇలాంటి క్షణాలు ఏదైనా అర్థవంతమైనది నిర్మించే క్రమంలో ఎదురవుతుంటాయి. మా కెప్టెన్, జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మేము బలంగా తిరిగి వస్తాం” అంటూ ఆయన అన్నారు. ఎకానా స్టేడియంలో మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, లక్నో సూపర్ జెయింట్స్ కథ ఇంకా ముగియలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Not everything you see is the true story, here’s the unfiltered post match vibes, when cameras don’t cut. pic.twitter.com/EiPMWrmlkQ
— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2026
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!