Site icon NTV Telugu

Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ..? ఎంఐ పోస్టుతో మొదలైన రచ్చ..!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అదే ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టులో చేరబోతున్నాడా? అని. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. రోహిత్ సన్నిహిత మిత్రుడు తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులైన అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ఆడవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.

BSNL దెబ్బకి జియో, ఎయిర్‌టెల్‌ విలవిలా.. చౌక ధరకే 6 నెలల, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు..!

ఈ వార్తలు చర్చనీయాంశంగా మారుతుండగా.. తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా సోషల్ మీడియాలో దీటుగా స్పందించింది. వారి అధికారిక సోషల్ మీడియా పేజీలో “సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు.. కానీ (K)రాత్రిపూట అది అసాధ్యం!” అంటూ పోస్టు చేసింది. ఈ వాక్యాన్ని చూసి అభిమానులు రోహిత్ శర్మ ముంబైని వదిలి వెళ్లడం అసాధ్యం అనే పరోక్ష సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ స్నేహం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. అభిషేక్ నాయర్ కేకేఆర్ కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. వారి మధ్య ఉన్న బంధం క్రికెట్ వర్గాలకు తెలిసిన విషయమే. నాయర్ ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో రోహిత్‌కు కీలక మార్గదర్శకత్వం అందించారు. గతంలో బరువు పెరిగిన రోహిత్, నాయర్ సూచనలతో కఠోర శ్రమ చేసి సుమారు 10 కిలోల బరువు తగ్గి అద్భుత ఫామ్‌ను తిరిగి సాధించారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ రెండో వన్డేలో 73, మూడో వన్డేలో అజేయంగా 121 పరుగులు ఆయన శిక్షణ ఫలితంగా కనిపించింది. ఈ ఫామ్‌తో రోహిత్ తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నారు.

Smartphones Launch In November: నవంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్ ఇవే..!

ఈ నేపథ్యంలో కేకేఆర్ ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేసింది. “మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారు.. దీనికి మీరు అర్హులు, అభినందనలు రోహిత్” అంటూ.. ఒక అభిమాని ఆ పోస్ట్‌కి “అయితే కన్ఫామ్ అనుకోవచ్చా..?” అని కామెంట్ చేయగా.. కేకేఆర్ “నంబర్ 1 వన్డే బ్యాటర్ కన్ఫామ్” అని సమాధానం ఇచ్చింది. ఆ అభిమానుడు “అంటే హిట్‌మ్యాన్ KKRలో చేరినట్టే..” అని రిప్లై ఇవ్వడంతో ఈ సంభాషణ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఇప్పటివరకు రోహిత్ శర్మ కేకేఆర్ లేదా ముంబై ఇండియన్స్ ఎవరూ ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఆటగాళ్ల రిటెన్షన్, వేలం సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత వేడెక్కుతున్నాయి. రోహిత్ నిజంగా పర్పుల్ జెర్సీలో కనిపిస్తారా..? లేక మళ్లీ ముంబై బ్లూ రంగుల్లోనే మెరవబోతారా..? అన్నది ఇప్పుడు అభిమానుల ఆసక్తిని రగిలిస్తోంది.

Exit mobile version