Site icon NTV Telugu

Jasprit Bumrah: బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!

Jasprit Bumrah Abhinav Manohar

Jasprit Bumrah Abhinav Manohar

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?.

ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభినవ్ మనోహర్ భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ తర్వాత బంతిని బుమ్రా ఫుల్‌టాస్‌గా సంధించాడు. బంతి కాస్త నేరుగా అభినవ్ పొట్ట వద్ద తాకింది. దాంతో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. వెంటనే తేరుకొని బ్యాటింగ్‌ కొనసాగించాడు. అయితే బుమ్రా మాత్రం కనీసం అభినవ్‌కు ఏమైందా అని కూడా చూడలేదు. బౌలింగ్‌ వేసేందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

Also Read: Tilak Varma: ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!

జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించిన తీరుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుమ్రా ప్రవర్తనపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ‘ఇప్పటికే చాలాసార్లు గమనించాం.. బుమ్రా ఇది సరైన పద్దతి కాదు’. ‘నీ బౌలింగ్‌లో సిక్స్‌ కొడితే.. దెబ్బతాకినా పరామర్శించవా?’, ‘బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా’, ‘అభినవ్‌ను పరిశీలించి ఉంటే బాగుండేది’, ‘అప్పుడు కరుణ్‌ నాయర్‌తో.. ఇప్పుడు అభినవ్‌తో ఇలానే వ్యవహరించావు’ అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

Exit mobile version