Jasprit Bumrah: బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!
- బుమ్రా బౌలింగ్‌లో అభినవ్ మనోహర్ భారీ సిక్స్
- అభినవ్ పొట్టకు బంతిని సంధించిన బుమ్రా
- కనీసం అభినవ్‌కు ఏమైందా అని కూడా చూడని బుమ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. మొహం మీద చిరునవ్వు ఉంటుంది. ప్రత్యర్థి బ్యాటర్ తన బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులు బాదినా.. నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మైదానంలో ఏ ఆటగాడికైనా గాయం అయితే పలకరిస్తాడు. అయితే తాజాగా బుమ్రా ప్రవర్థించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు బుమ్రా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?.
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభినవ్ మనోహర్ భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని బుమ్రా ఫుల్‌టాస్‌గా సంధించాడు. బంతి కాస్త నేరుగా అభినవ్ పొట్ట వద్ద తాకింది. దాంతో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. వెంటనే తేరుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే బుమ్రా మాత్రం కనీసం అభినవ్‌కు ఏమైందా అని కూడా చూడలేదు. బౌలింగ్ వేసేందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
Also Read: Tilak Varma: ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!
జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించిన తీరుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుమ్రా ప్రవర్తనపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ‘ఇప్పటికే చాలాసార్లు గమనించాం.. బుమ్రా ఇది సరైన పద్దతి కాదు’. ‘నీ బౌలింగ్‌లో సిక్స్ కొడితే.. దెబ్బతాకినా పరామర్శించవా?’, ‘బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా’, ‘అభినవ్‌ను పరిశీలించి ఉంటే బాగుండేది’, ‘అప్పుడు కరుణ్ నాయర్‌తో.. ఇప్పుడు అభినవ్‌తో ఇలానే వ్యవహరించావు’ అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.
— Nihari Korma (@NihariVsKorma) April 23, 2025
Bumrah needs to grow some maturity as a human being ….
he should at least have checked if Abhinav Manohar is okay after hitting him badly with that full-toss beamer. #SRHvsMI
— Chaitanya ˢ ˢ ᵀʰᵃᵐᵃⁿ (@kkchaitanya9999) April 23, 2025
#IPL2025 SRH vs MI – is Bumrah becoming arrogant? His Yorker hit Abhinav Manohar in the stomach and he casually walked away without even on single expression of concern for the batter.
— BlueChalkMusings (@BlueChalknBoard) April 23, 2025
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!