NTV Telugu Site icon

SRH vs GT: ఈసారైనా గెలుస్తారా? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

Srh Vs Gt

Srh Vs Gt

SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కట్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. ఇక గత 3 మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో ఎలాగైనా విజయం సాధించాలని రంగంలోకి దిగుతోంది. ఇక నేడు ప్లేయింగ్ XI జట్లు ఇలా ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (SRH XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్‌రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), జీషాన్ అంసారీ, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ షమీ

SRH ఇంపాక్ట్ ప్లేయర్లు:
అభినవ్ మనోహర్, సచిన్ బేబి, సిమర్జీత్ సింగ్, రాహుల్ చహర్, వియాన్ ముల్డర్

గుజరాత్ టైటాన్స్ జట్టు (GT XI):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషిద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ క్రిష్ణ, ఇషాంత్ శర్మ

GT ఇంపాక్ట్ ప్లేయర్లు:
షెర్ఫేన్ రదర్ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహీపాల్ లోంరోర్, అర్షద్ ఖాన్.