NTV Telugu Site icon

IPL 2025 SRH: ఈ అడ్డంకులను దాటుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించేనా?

Ipl 2025 Srh

Ipl 2025 Srh

IPL 2025 SRH: ఐపీఎల్ 2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ రిటెన్షన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టింది. ఇందుకు తగ్గట్టే.. హైదరాబాద్‌కు ప్లే-ఆఫ్ స్థానంకు చేరుకొనే మంచి స్క్వాడ్ ఉందని చెప్పవచ్చు. కానీ, టైటిల్ కోసం వీరిని ఫేవరెట్లని పేర్కొనడం కష్టమవుతుంది. ప్యాట్ కమ్మిన్స్ తోపాటు ఇతర ఆటగాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడితే మాత్రమే.. వారు గత సీజన్ లో చేసిన ప్రదర్శనలను పునరావృతం చేసేందుకు రెడీగా ఉంటారు.

ఐపీఎల్ 2025 SRH స్క్వాడ్ చూస్తే ఇందులో ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హైన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అథర్వా తైడే, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, ఆదం జంపా, రాహుల్ చహర్, జీషాన్ అన్‌సారీ, మొహమ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జయదేవ్ యునడ్కట్, విఆన్ ముల్డర్, ఎషాన్ మాలింగా లాంటి హేమాహేమీలతో జట్టు బలంగానే కనిపిస్తుంది.

Read Also: IPL 2025: మ్యాచ్ టై లేదా రద్దు అయితే.. రూల్స్ ఏమి చెబుతున్నాయంటే!

ఇకపోతే, నిజానికి SRH దగ్గర టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో ప్రత్యేకంగా ఉన్న వారే లేరు. గత సీజన్ లో షహబాజ్ అహ్మద్, అభ్దుల్ సమద్ ఈ పాత్రలు చేపట్టినా.. కానీ, ఈ ఇద్దరూ ఐపీఎల్ 2025 సీజన్ కు లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం SRH ప్లేయింగ్ XIలో ప్యాట్ కమ్మిన్స్ 7వ స్థానంలో ఉంటే.. ఆపై ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉంటారు. బ్యాటింగ్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కోసం అథర్వా తైడే, అనికేత్ వర్మను తీసుకుంటే వారు కూడా టాప్ 6 లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ళు మాత్రమే.

నిజానికి ఇషాన్ కిషన్‌పై భారీ మొత్తం ఖర్చు పెట్టడం SRH కు పెద్ద దెబ్బె. ఎందుకంటే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ టాప్ ఆర్డర్ లో ఉండనే ఉన్నారు. వికెట్ కీపింగ్ అవసరం లేకుండా హైన్రిచ్ క్లాసెన్‌ను రిటైన్ చేశారు. కిషన్ ప్రీ-సీజన్ క్యాంపులో మంచి ఫామ్ లో కనిపించినప్పటికీ, నంబర్ 3 పొజిషన్ లో అతని పెర్ఫార్మెన్స్ ఎంతో మెరుగ్గా ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ కిషన్ కొంత ఇబ్బంది పడుతుంటాడు. నిజానికి. కిషన్ ఉండడం వల్ల టాప్-ఆర్డర్ బ్యాటర్ల ఉపయోగం పరిమితం అవుతుంది. ఇది SRH కు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనుంది.

Read Also: IPL 2025: ఉప్పల్‌లో ఎల్లుండి మ్యాచ్.. భారీ బందోబస్తు ఏర్పాటు

SRH వద్ద బౌలింగ్ డిపార్ట్‌మెంట్లో కూడా భారీ లోపం కనపడుతోంది. ఆడం జంపా, రాహుల్ చహర్ ను స్పిన్ కాంబినేషన్‌గా ఆడించాల్సి వస్తుంది. మరొక స్పిన్నర్ అవసరమైతే అభిషేక్ శర్మను మూడో ఆప్షన్‌గా వాడుకోవాల్సి ఉంటుంది. SRH ఫస్ట్-చాయిస్ బౌలింగ్ స్పెషలిస్ట్‌లలో ఎవరూ లెఫ్ట్-హ్యాండర్లు లేరు. ఇది కూడా బౌలింగ్ డిపార్మెంట్ ను కాస్త ఇబ్బంది పెట్టించే అంశమే.