Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl 2025 Rcb Became The First Team To Loss The Most Defeats At A Single Venue

RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ తొలి జట్టుగా!

Published Date :April 11, 2025 , 10:35 am
By Sampath Kumar
  • చిన్నస్వామి స్టేడియంలో డీసీపై ఆర్‌సీబీ ఓటమి
  • ఆర్‌సీబీ ఖాతాలో ఓ చెత్త రికార్డు
  • అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు
RCB vs DC: ఆర్‌సీబీ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ తొలి జట్టుగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్‌’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్‌; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్‌ క్యాచ్‌ను కెప్టెన్‌ పాటీదార్‌ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (37; 17 బంతుల్లో 4×4, 3×6), టిమ్‌ డేవిడ్‌ (37; 20 బంతుల్లో 2×4, 4×6) మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీకి హోం అడ్వాంటేజ్‌ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఐదు మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించగా.. అవన్నీ బయటి మైదానాల్లోనే కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్‌పై చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో ఆర్‌సీబీ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఒకే వేదికపై అత్యధిక పరాజయాలు చవిచూసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఇప్పటివరకు 45 మ్యాచుల్లో ఓడింది.

అంతకుముందు ఈ చెత్త రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరిట ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ 44 మ్యాచ్‌ల్లో ఓడింది. డీసీ రికార్డు ఇప్పుడు బెంగళూరు బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఈడెన్ గార్డెన్స్‌లో 38 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ మూడవ స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్‌-18 టైటిల్ దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి డీసీ కళ్లెం వేసింది. మరోవైపు ఐపీఎల్ 2025లో డీసీ జోరు కొనసాగుతోంది. మిగతా జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఓడగా.. ఢిల్లీ మాత్రం అజేయంగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chinnaswamy Stadium
  • IPL 2025
  • KL Rahul
  • KL Rahul 93
  • rcb vs dc

తాజావార్తలు

  • Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్

  • Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

  • Iran: ట్రంప్ వార్నింగ్‌కు స్ట్రాంగ్ ఇరాన్ కౌంటర్.. అమెరికాకు ఇదే చివరి హెచ్చరిక అంటూ..

  • Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!

  • Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions