Rahul Dravid Coach: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
- టీమిండియా హెడ్ కోచ్‌గా పదవీకాలం పూర్తి
- ఐపీఎల్‌లోకి రాహుల్ ద్రవిడ్ రీఎంట్రీ
- ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా ది వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Dravid Likely to Return Rajasthan Royals as Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన విషయం తెలిసిందే. ద్రవిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని మెంటార్‌గా లేదా కోచ్‌గా తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో ద్రవిడ్‌ను మెంటార్‌గా కేకేఆర్ ప్రాంచైజీ నియమిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ది వాల్ రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌ను హెడ్ కోచ్‌గా నియమించాలని రాజస్థాన్ ఫ్రాంఛైజీ భావిస్తోందని సమాచారం. రాజస్థాన్ రాయల్స్, రాహుల్ ద్రవిడ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆర్ఆర్ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలవడంతో ద్రవిడ్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అతడి కోసం చాలా ప్రాంఛైజీలు క్యూలో ఉన్నాయి.
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
Also Read: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాహుల్ ద్రవిడ్‌కు మంచి అనుబంధం ఉంది. గతంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మెంటార్‌గా కూడా పనిచేశాడు. ఈ నేపదాయంలో రాజస్థాన్ వైపే ది వాల్ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.. ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ద్రవిడ్ హెడ్ కోచ్‌గా రీఎంట్రీ ఇస్తాడో లేదో.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!