PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!
- క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
- విజయమే లక్ష్యంగా బరిలోకి ఆర్సీబీ
- కలవరపెడుతున్న విరాట్ కోహ్లీ ప్లేఆఫ్స్ గణాంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇప్పటివరకు బెంగళూరు మూడు ఫైనల్స్‌లో ఆడింది కానీ.. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి టైటిల్ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. క్వాలిఫైయర్ 1లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్లేఆఫ్స్ గణాంకాలు కాస్త కలవరపెడుతున్నాయి.
ఆర్సీబీ ఇప్పటివరకు 15 ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడింది. ఈ 15 ప్లేఆఫ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడాడు. ఈ 15 మ్యాచ్‌లలో కోహ్లీ ప్రదర్శన ఏమంత బాగా లేదు. 26 సగటు, 122 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. ప్లేఆఫ్స్‌లో ఒత్తిడి చిత్తవుతున్న విరాట్ కారణంగానే 10 సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లినా ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదని నెటిజెన్స్ అంటున్నారు. అయితే ఈసారి సీజన్ ఆసాంతం పరుగులు చేస్తున్న కోహ్లీ.. ప్లేఆఫ్స్‌లో కచ్చితంగా సత్తాచాటుతాడని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో విరాట్ 600 పరుగుల మార్కును దాటిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో నేడు జరిగే క్వాలిఫైయర్ 1లో కింగ్ ఎలా ఆడుతాడో చూడాలి.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: AP Coronavirus Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!
ఆర్సీబీ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఇలా:
2009 – ఫైనల్ (డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి)
2010 – సెమీ ఫైనల్ (ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగులు తేడాతో ఓటమి)
2011 – ఫైనల్ (చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి)
2015 – క్వాలిఫయర్-2 (చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి)
2016 – ఫైనల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి)
2020 – ఎలిమినేటర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి)
2021 – ఎలిమినేటర్ (కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి)
2022 – క్వాలిఫయర్-2 (రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి)
2024 – ఎలిమినేటర్ (రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి)
తాజావార్తలు
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..