Site icon NTV Telugu

PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్‌ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇప్పటివరకు బెంగళూరు మూడు ఫైనల్స్‌లో ఆడింది కానీ.. ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో ఈసారి టైటిల్‌ లక్ష్యంగా ముందుకు దూసుకెళుతోంది. క్వాలిఫైయర్ 1లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్లేఆఫ్స్‌ గణాంకాలు కాస్త కలవరపెడుతున్నాయి.

ఆర్‌సీబీ ఇప్పటివరకు 15 ఐపీఎల్ ప్లేఆఫ్స్‌ ఆడింది. ఈ 15 ప్లేఆఫ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడాడు. ఈ 15 మ్యాచ్‌లలో కోహ్లీ ప్రదర్శన ఏమంత బాగా లేదు. 26 సగటు, 122 స్ట్రైక్ రేట్‌తో 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. ప్లేఆఫ్స్‌లో ఒత్తిడి చిత్తవుతున్న విరాట్ కారణంగానే 10 సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లినా ఆర్‌సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదని నెటిజెన్స్ అంటున్నారు. అయితే ఈసారి సీజన్ ఆసాంతం పరుగులు చేస్తున్న కోహ్లీ.. ప్లేఆఫ్స్‌లో కచ్చితంగా సత్తాచాటుతాడని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో విరాట్ 600 పరుగుల మార్కును దాటిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో నేడు జరిగే క్వాలిఫైయర్ 1లో కింగ్ ఎలా ఆడుతాడో చూడాలి.

Also Read: AP Coronavirus Cases: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. గాయపడిన మహిళకు పాజిటివ్!

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఇలా:
2009 – ఫైనల్ (డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి)
2010 – సెమీ ఫైనల్ (ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగులు తేడాతో ఓటమి)
2011 – ఫైనల్ (చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి)
2015 – క్వాలిఫయర్-2 (చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి)
2016 – ఫైనల్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి)
2020 – ఎలిమినేటర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి)
2021 – ఎలిమినేటర్ (కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి)
2022 – క్వాలిఫయర్-2 (రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి)
2024 – ఎలిమినేటర్ (రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి)

 

Exit mobile version