NTV Telugu Site icon

MI vs GT: మొదటి గెలుపు కోసం తలబడనున్న ఇరు జట్లు.. విజయం ఎవరిని వరించేనో..!

Mi Gt

Mi Gt

ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో.. జట్టుకు మరింత బలం చేకూరనుంది. కాగా.. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read Also: Vivo V50e: అతి త్వరలో స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచేయనున్న వివో V50e

అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్
నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ ఫ్లాట్‌గా, గట్టిగా ఉండే అవకాశముంది. దీంతో.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో రెండు జట్లు భారీగా పరుగులు సాధించాయి. దీంతో, బౌలర్లకు ప్రభావం చూపించడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ ట్రెండ్ శనివారం కూడా కొనసాగవచ్చని అంచనా. ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు కొంత సహాయం లభించవచ్చు. కానీ బంతి మృదువుగా మారిన తర్వాత.. బ్యాటర్లు రాణించే అవకాశం ఉంది.

అహ్మదాబాద్ వాతావరణ నివేదిక
క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త ఏంటంటే.. శనివారం అహ్మదాబాద్‌లో వర్షం పడే సూచనలు లేవు. మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగనుంది. తేమ తక్కువగా ఉండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని అంచనా. టాస్ సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. అయితే.. మ్యాచ్ ముగిసే సమయంలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ముంబై ఇండియన్స్ ప్రిడిక్టెడ్ XI:

రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు,
ఇంపాక్ట్ సబ్: విఘ్నేష్ పుత్తూరు (12వ ఆటగాడు)

గుజరాత్ టైటాన్స్ ప్రిడిక్టెడ్ XI:
శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (wk), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, R సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ సబ్: ప్రసిద్ధ్ కృష్ణ (12వ ఆటగాడు)

మ్యాచ్‌పై ముంబై ఇండియన్స్ ఆశలు
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2025లో విజయాన్ని నమోదు చేయలేదు. అయితే, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరడం జట్టుకు ప్రేరణ కలిగించవచ్చు. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్‌లో గెలిస్తే, సీజన్‌లో గణనీయమైన మార్పు తీసుకురాగలదని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ కూడా తమ సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు.. నేడు క్రికెట్ అభిమానులకు హై వోల్టేజ్ థ్రిల్లర్ మ్యాచ్ గా ఉండనుంది.