Site icon NTV Telugu

Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. తొలి బ్యాట్స్‌మన్‌గా..!

Rohit Sharma Mi

Rohit Sharma Mi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. హిట్‌మ్యాన్‌ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 300 సిక్సుర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 300 సిక్సుర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. చెన్నై, హైదరాబాద్ జట్లపై రోహిత్ చెలరేగి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. గేల్‌ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు కొట్టాడు. రోహిత్‌ శర్మ 265 మ్యాచ్‌ల్లో 295 సిక్సర్లు బాదాడు. విరాట్‌ కోహ్లీ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు. ఎంఎస్‌ ధోనీ (260),
ఏబీ డివిలియర్స్‌ (251) టాప్ 5లో కొనసాగుతూన్నారు. ఈ జాబితాలో సంజు శాంసన్ (216), కేఎల్ రాహుల్ (203)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా గేల్‌ పేరుపై ఉంది. పొట్టి ఫార్మాట్‌లో యూనివర్సల్ బాస్ 1056 సిక్సర్లు బాదాడు. కీరన్‌ పోలార్డ్‌ (908), ఆండ్రీ రసెల్‌ (737), నికోలస్ పూరన్‌ (630), కొలిన్‌ మున్రో (557), అలెక్స్‌ హేల్స్‌ (552), రోహిత్‌ శర్మ (540), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (530), జోస్‌ బట్లర్‌ (528), డేవిడ్‌ మిల్లర్‌ (505) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల లిస్ట్:
# క్రిస్‌ గేల్‌ – 357
# రోహిత్‌ శర్మ – 295
# విరాట్‌ కోహ్లీ – 285
# ఎంఎస్‌ ధోనీ – 260
# ఏబీ డివిలియర్స్‌ – 251

Also Read: Virat Kohli vs KL Rahul: ఊరమాస్ లెవెల్‌లో రాహుల్ వార్నింగ్.. ప్రతీకారానికి సిద్దమైన కోహ్లీ!

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల లిస్ట్:
# క్రిస్‌ గేల్‌ – 1056
# కీరన్‌ పోలార్డ్‌ – 908
# ఆండ్రీ రసెల్‌ – 737
# నికోలస్‌ పూరన్‌ – 630
# కొలిన్‌ మున్రో – 557

Exit mobile version