IPL 2025: అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ
- మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం
- కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్య రహానే
- కోల్‌కతా వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ప్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ నియమించారు. డాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 23.75 కోట్లు పెట్టి కొనుకున్న అయ్యర్‌ను సారథిగా ఎంపికవుతాడని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే సీఈవో వెంకీ అనూహ్యంగా రహానేను కెప్టెన్‌గా నియమించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుకున్న అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై సీఈవో వెంకీ మైసూర్ వివరణ ఇచ్చారు. అయ్యర్ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని, అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు.
కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ… ‘ఐపీఎల్ చాలా ఒత్తిడితో కూడిన టోర్నమెంట్. కెప్టెన్సీ కోసం మేము వెంకటేష్ అయ్యర్ గురించి చర్చించాం. అయితే కెప్టెన్సీ కారణంగా యువకుడైన అతడిపై భారం పడుతుందని భావించాం. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. స్థిరత్వం, పరిణతి, అనుభవం ఉన్న ఆటగాడు అవసరం. ఈ లక్షణాలు అజింక్య రహానేలో ఉన్నాయి’ అని చెప్పారు. వెంకటేష్ అయ్యర్ తదుపరి కేకేఆర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రహానే కెప్టెన్సీలో అయ్యర్ అన్ని విషయాలు నేర్చుకుంటాడు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
Also Read: Rohit Sharma: ఐపీఎల్ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!
ఐపీఎల్ 2024 అనంతరం వెంకటేష్ అయ్యర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని తిరిగి రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు వేలంలో అజింక్య రహానే పేరు మొదట వచ్చినప్పుడు కేకేఆర్ తీసుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్లు మరోసారి వేలంలోకి రాగా.. రహానేను బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 36 ఏళ్ల రహానే 2008 నుండి వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 185 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత జట్టుకు కూడా సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. ఐపీఎల్ 2024లో టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును వీడిన విషయం తెలిసిందే. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!