NTV Telugu Site icon

KKRvsRCB: 16 ఏళ్ల క్రితం కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్‌.. ఏ టీం గెలిచిందంటే?

Kkr Vs Rcb

Kkr Vs Rcb

మరి కొన్ని నిమిషాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఘనంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. టోర్నమెంట్ మొదటి సీజన్‌ 2008లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పుడు కేకేఆర్ భారీ తేడాతో గెలిచింది. 2008 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ కేకేఆర్ తరఫున 158 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు తలపడనున్నాయి.18వ సీజన్‌కి కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదిక అవుతోంది. అభిమానులు ఈ పోరును ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లు బలంగా ఉండటంతో ఉత్కంఠ భరితమైన పోరాటం జరిగే అవకాశముంది. ఐపీఎల్ 2025కు ఇదే ఓ అద్భుతమైన ఆరంభం కానుందా? చూడాలి!

READ MORE: India GDP: రికార్డ్ క్రియేట్ చేసిన భారత్ జీడీపీ.. 2027 నాటికి జపాన్, జర్మనీ మన వెనకే..

కాగా.. ఈ సీజన్‌లో పలు జట్ల కెప్టెన్లు మారడం, కొత్త కెప్టెన్లు రావడం ఈ ఐపీఎల్‌ లో మరో విశేషం. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మాత్రం ఇప్పటివరకు టీమ్‌ఇండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడని రజత్‌ పాటిదార్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం. అక్షర్‌ పటేల్‌ దిల్లీ పగ్గాలు అందుకోగా.. నిరుడు కోల్‌కతాకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి పంజాబ్‌ కింగ్స్‌ను నడిపించనున్నాడు. సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె అనూహ్యంగా కోల్‌కతా కెప్టెనయ్యాడు. దిల్లీని వీడిన రిషబ్‌ పంత్‌.. ఈసారి లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ పగ్గాలు అందుకున్నాడు.