Site icon NTV Telugu

IPL 2025 Final: ఫైనల్‌‌లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!

Ipl 2025 Final

Ipl 2025 Final

IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌ లో తలపడే రెండు జట్లు అంటూ భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాబిన్ ఉతప్ప అభిప్రయం ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుందని అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్

ఇకపోతే, పంజాబ్ కింగ్స్ తాజాగా ముంబై ఇండియన్స్‌పై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచుల్లో 19 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో లక్నోపై గెలిచితే వారు కూడా టాప్ ప్లేస్‌కి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే, వారికి నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది.

ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. టోర్నమెంట్ చివరి దశకు వచ్చే సరికి జట్టు దగ్గర సరైన మోమెంటం ఉండటం చాలా ముఖ్యం. పంజాబ్ సీజన్‌ మొదట్లో అదిరిపోయే ఆరంభం చేసింది. మధ్యలో కొద్దిగా జారిపోయినా, ప్లేఆఫ్స్ ముందు మళ్లీ ఫామ్‌కి వచ్చింది. జట్టులోని బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉందని ఇది పంజాబ్‌కి కలిసొచ్చే అంశమని అన్నాడు. అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్‌ ను కూడా ఉతప్ప పొగిడాడు.

Read Also:Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?

శ్రేయాస్ ఎప్పుడూ మంచి కెప్టెన్‌.. KKRలోనూ అతను విలువైన కాప్టెన్సీ చేశాడు. కానీ, అక్కడ అతనికి తక్కువ గుర్తింపు లభించింది. ఇప్పుడు పంజాబ్‌కి వచ్చి 11 ఏళ్ల తర్వాత జట్టును ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇది అతని నాయకత్వ గుణాలను చూపిస్తుందని అన్నాడు. మొత్తానికి, రాబిన్ ఉతప్ప అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరుగుతుందని పేర్కొన్నాడు.

Exit mobile version