Sunrisers Hyderabad probable Retain List for IPL 2025: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఘోర ఓటమి మినహా.. ఎస్‌ఆర్‌హెచ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ 2025లో టైటిలే లక్ష్యంగా ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఇందుకోసం ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రిటైన్, వదులుకునే ప్లేయర్ల జాబితాపై ఎస్‌ఆర్‌హెచ్ తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.
ఐపీఎల్ ప్రాంచైజీ ఓనర్లతో ఇప్పటికే బీసీసీఐ సమావేశం అయింది. ఈ భేటీలో ఎక్కువ మందికి రిటెన్షన్ అవకాశం ఇవ్వాలని ప్రాంచీలు బీసీసీఐని కోరాయి. దీనిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గరిష్టంగా 4 లేదా 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కోఓనర్ కావ్య మారన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో బాగా ఆడిన ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా వారిని వేలంలోకి వదిలేయాలని చూస్తున్నారట. వదిలేసే ఆటగాళ్ల జాబితాలో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.
Pat Cummins:
కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రిటైన్ చేసుకోవాలని కావ్య మారన్ భావిస్తున్నారట. బౌలర్, సారథిగా కమిన్స్ గతేడాది సక్సెస్ అవ్వడమే ఇందుకు కారణం. కొన్ని మ్యాచులలో బ్యాటర్‌గా మెరిశాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో కమిన్స్‌ను రూ.20.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Abhishek Sharma:
ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ లిస్టులో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఓపెనర్‌గా వచ్చి దూకుడుగా ఆడడం అతడి శైలి. ఐపీఎల్ 2024లో జట్టుకు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. గతేడాది అతడు 482 రన్స్ చేశాడు. ప్రస్తుతం అభిషేక్ జట్టుకు విలువైన ఆస్తిగా మారాడు.
Bhuvneshwar Kumar:
హైదరాబాద్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. 2014 నుంచి జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. 2016, 2017లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అయితే గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చిన భువీ కాస్త పదును కోల్పోయాడు. ఐపీఎల్ 2024లో 16 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కావ్య మారన్ భావిస్తున్నారట.
Also Read: KL Rahul-LSG: కేఎల్ రాహుల్‌కు షాక్.. కొత్త కెప్టెన్ కోసం లక్నో అన్వేషణ!
Abdul Samad:
ప్రతిభావంతుడైన యువ బ్యాటర్ అబ్దుల్ సమద్. రిటైన్ లిస్టులో ఇతడు కూడా ఉన్నాడు. హిట్టింగ్ చేయడం, ఇన్నింగ్స్‌లను ముగించగల సామర్థ్యం ఉండడం అతడికి కలిసొచ్చే అంశం. 16 మ్యాచులలో 182 రన్స్ చేశాడు. అయితే ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఐదుగురికి అవకాశం ఉంటే ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిలలో ఒకరికి అవకాశం ఉంటుంది. హెన్రిచ్ క్లాసెన్ కూడా రేసులో ఉన్నాడు. ఇక గతేడాది విఫలమైన స్టార్ ప్లేయర్స్ ఐడెన్ మార్క్‌రమ్, మార్కో జేన్సన్‌లపై వేటు పడడం ఖాయం.
