KL Rahul-LSG: కేఎల్ రాహుల్‌కు షాక్.. కొత్త కెప్టెన్ కోసం లక్నో అన్వేషణ!
- గోయెంకాను కలిసిన రాహుల్
- రిటైన్ చేసుకోవాలని కోరిన రాహుల్
- హామీ ఇవ్వని లక్నో మేనేజ్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul LSG Captaincy: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబద్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో రాహుల్ ఎల్ఎస్జీని వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం కోల్‌కతాలో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశాడు. లక్నో కెప్టెన్ తనను రిటైన్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. అయితే రాహుల్‌ను గ్యారంటీగా రిటైన్ చేసుకుంటామని చెప్పలేమని ఎల్ఎస్జీ ఫ్రాంఛైజీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.
‘కోల్‌కతాకు వచ్చి ఆర్పీజీ ప్రధాన కార్యాలయంలో సంజీవ్ గోయెంకాను కేఎల్ రాహుల్ కలిశారు. ఎల్‌ఎస్‌జీనే తాను ఉంటానని గోయెంకాతో చెప్పారు. బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే ఎల్ఎస్జీ తమ ప్రణాళికలను రూపొందిస్తుంది. లక్నో తనను రిటైన్ చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నాడు కానీ.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసిన తర్వాతే ఎంతమందిని రిటైన్ చేసుకోవాలనేది లక్నో మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఎల్ఎస్జీ ఎవరికీ మాట ఇవ్వలేదు’ అని లక్నో ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.
Also Read
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
- Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
Also Read: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్.. నేడు తులం ఎంతుందంటే?
‘ఒకవేళ లోకేష్ రాహుల్‌ను ఎల్ఎస్జీ రిటైన్ చేసుకున్నా.. కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం మాత్రం లేదు. బ్యాటర్‌గా తన సేవలు అందించాలని రాహుల్ కోరుకుంటున్నాడు. లక్నో కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది. నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా సహా మరికొందరు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కెప్టెన్సీపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని లక్నో ఫ్రాంఛైజీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఏదేమైనా రాహుల్‌కు షాక్ తగిలేలా తప్పేలా లేదు. లక్నో ఫ్రాంఛైజీ వర్గాల మాటలను బట్టి చూస్తే కెప్టెన్సీ పోవడం మాత్రం పక్కా అని అర్ధమవుతోంది. గత మూడేళ్లుగా లక్నోతోనే రాహుల్ ఉంటుంన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!