NTV Telugu Site icon

IPL 2025 Auction: రోహిత్‌ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్‌

Rohit Sharma Rcb

Rohit Sharma Rcb

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. దీంతో ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వేలంలోకి వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అందరి కళ్లు ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మపైనే ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో హిట్‌మ్యాన్ తన పేరును నమోదు చేసుకుంటాడని ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం.

ఐపీఎల్ 2024 ముందు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి ఫ్రాంఛైజీకి, రోహిత్‌కు మధ్య గ్యాప్‌ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో ఉన్న 13 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పి.. వేరే ఫ్రాంఛైజీలో చేరాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌ను తీసుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తున్నాయట. ఇందులో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కూడా ఉందట.

Also Read: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతుండగా.. అభిమాని నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా? అని అని అడిగాడు. దీనికి అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. రోహిత్‌ రోహిత్‌ను దక్కించుకోవాలంటే ఆర్సీబీ కనీసం రూ.20 కోట్లు పక్కన పెట్టుకోవాలని యాష్ సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్‌ 31లోపు సమర్పించాలి.