NTV Telugu Site icon

IPL 2025 Auction: శ్రేయస్ అయ్యర్‌పై ఆ రెండు టీమ్స్ కన్నేసాయి.. గవాస్కర్ బోల్డ్ ప్రిడిక్షన్!

Shreyas Iyer

Shreyas Iyer

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక‌గా మెగా ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా.. అందులో 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇక 204 ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి.

ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. కెప్టెన్సీ అనుభవం ఉన్న ఈ ముగ్గురిపై కాసుల వర్షం కురవనుంది. మెగా వేలం నేపథ్యంలో శ్రేయస్ గురించి భారత దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలు శ్రేయస్ కోసం పోటీ పడతాయని తెలిపారు. వేలంలో శ్రేయస్ వచ్చినప్పుడు కేకేఆర్‌ బిడ్ (రైట్ టు మ్యాచ్) వేస్తుందని, ఢిల్లీ కూడా అతని కోసం ప్రయత్నించవచ్చని బోల్డ్ ప్రిడిక్షన్ చెప్పారు.

స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్‌’లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘గత సంవత్సరం కేకేఆర్‌ టైటిల్ గెలిచినప్పుడు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు రిషబ్ పంత్‌ ఫీజు విషయంలో భిన్నాభిప్రాయాలు రావొచ్చు. అయితే శ్రేయాస్ వేలంలోకి వచ్చిన తర్వాత కేకేఆర్‌ బిడ్ వేయొచ్చని నేను భావిస్తున్నాను. ఢిల్లీ కూడా ప్రయత్నించవచ్చు. పంత్ దక్కని సందర్భంలో శ్రేయస్ కోసం ఢిల్లీ తప్పక ట్రై చేస్తుంది. పంత్ కోసం ఢిల్లీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తుంది కూడా. ఎందుకంటే ఢిల్లీకి కెప్టెన్‌ అవసరం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్‌.. అయ్యర్‌ సారథ్యంలో సూర్యకుమార్‌!

ఐపీఎల్ 2025 కోసం సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను కేకేఆర్‌ అట్టిపెట్టుకుంది. రింకు రూ.13 కోట్లతో కేకేఆర్‌ టాప్ రిటెన్షన్ కాగా.. వరుణ్, సునీల్, రస్సెల్‌లను రూ.12 కోట్లతో రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ కింద రూ.4 కోట్లతో హర్షిత్, రమణదీప్‌లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను రిటెన్షన్ చేసుకుందామనుకున్నా.. అతడు ఒప్పుకోలేదు. మరి శ్రేయాస్ ఏ జట్టుకు ఆడుతాడో చూడాలి.