IPL 2025-MI: ముంబై జట్టులో భారీ మార్పులు ఖాయం.. హార్దిక్, రోహిత్ సహా..: ఆకాశ్
- ఐపీఎల్ 2025 మెగా వేలం
- ముంబై జట్టులోకి మహేల
- ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్థానంలో మహేల జయవర్థనే వచ్చాడు. ఐపీఎల్ 2024లో బౌచర్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని కెప్టెన్‌గా తొలగించి.. హార్దిక్ పాండ్యాని నియమించిన విషయం తెలిసిందే. హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, జట్టులో సమన్వయ లోపంతో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానాని పరిమితమైంది. గత కొద్దిరోజులుగా రోహిత్ జట్టుని వీడతాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ముంబై ప్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపాడు. కీలక ప్లేయర్లను అతిపెట్టుకోవడానికి రూ.79 కోట్లు వెచ్చించినా.. ముంబై ఫ్రాంచైజీకి ఎలాంటి నష్టం లేదన్నాడు.
‘మహేల జయవర్దనే తిరిగి ముంబై జట్టులోకి వచ్చాడు. దీంతో జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి వచ్చాడు. కాబట్టి ఐదుగురు కీలక ఆటగాళ్లని రిటైన్ చేసుకొని ఒకరిని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకునేందుకు ముంబై చూస్తుంది. హార్దిక్ సహా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ లేదా ఇషాన్ కిషన్‌ని రిటైన్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నెహాల్ వధేరాని తీసుకోవాలని భావిస్తోంది. వీరికి రూ.79 కోట్లు వెచ్చించి.. మిగతా మొత్తంతో వేలానికి వెళ్తుందని అనుకుంటా’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
Also Read: Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్
‘మహేల జయవర్థనే గొప్ప ఆటగాడు. బ్యాటర్, కెప్టెన్‌గా శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. అతడికి ముంబైతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేని నియమించడం మంచి విషయం. గత సీజన్‌లో జట్టు బౌలింగ్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ముంబైకి బౌలింగ్ కోచ్ అవసరం. అందుకే పరాస్‌ను తీసుకుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 వేలం నవంబర్ చివరలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రిటైన్ జాబితాను సమర్పించేందుకు ఈ నెల ఆఖరి గడువు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!