NTV Telugu Site icon

IPL 2024: హైదరాబాద్‌కు చేరుకున్న సన్‌రైజర్స్‌ ప్లేయర్స్.. ఉప్పల్‌లో ప్రాక్టీస్‌ షురూ!

Srh Practice

Srh Practice

SRH Team Practice Session in Hyderabad ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 17 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. లీగ్‌ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ సెషన్‌ను ఆరంభించాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) మంగళవారం (మార్చి 5) హోం గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియంలో తొలి టీమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసింది. ఆపై ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్స్ ప్రాక్టీస్‌ షురూ చేశారు.

ఉప్పల్‌ స్టేడియంలో మంగళవారం ఆరంభమైన ప్రాక్టీస్‌లో భారత పేసర్ టీ నటరాజన్‌ సహా మరికొందరు ప్లేయర్స్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. టీమ్‌ మీటింగ్‌ అనంతరం ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. ఇందుకుసంబంధించిన ఫోటోలను ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)ను సన్‌రైజర్స్‌ ఢీకొంటుంది. తొలి విడతలో సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

Also Read: Shahbaz Nadeem Retirement: రిటైర్మెంట్‌ ‍ప్రకటించిన షాబాజ్‌ నదీమ్‌.. టీమిండియాలో చోటు దక్కదంటూ..!

మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో ఢీ కొడుతుంది. మార్చి 31 గుజరాత్‌ టైటాన్స్‌తో, ఏప్రిల్‌ 5 చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడుతుంది. వీటిలో ముంబై, చెన్నై మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇస్తుంది. త్వరలోనే మిగతా ప్లేయర్స్ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో చేరనున్నారు.