IPL 2024: ఆర్సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netizens Slams Murali Kartik Over Controversial Comments on Yash Dayal: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తిక్ వ్యాఖ్యలకు బెంగళూరు ఫ్రాంచైజీ కౌంటర్ వేసింది.
ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ బౌలింగ్ చేస్తుండగా.. కామెంటేటర్ మురళీ కార్తిక్ మాట్లాడాడు. ‘మనం ఎప్పుడూ చెప్పినట్లే ఒకరికి పనికిరానిది (ట్రాష్) మరొకరికి విలువైన నిధిగా మారుతుంది’ అని అన్నాడు. కార్తిక్ చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ అంశంపై బెంగళూరు ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘అవును.. ఇతడు మా విలువైన నిధి’ అని పేర్కొంది. అంతేకాదు ఓ లవ్ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Also Read: CSK vs GT Dream11 Prediction: చెన్నై, గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు యశ్ దయాల్ ఆడాడు. ఆ సీజన్లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్.. యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు. దీంతో దయాల్‌ను గుజరాత్ పక్కనబెట్టింది. 2023 సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన దయాల్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అయినా కూడా 2024 వేలంలో ఆర్సీబీ దయాల్‌ను ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆర్సీబీ నమ్మకాన్ని దయాల్ తాజా సీజన్లో నిలబెట్టాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!