Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్‌కే మేనేజ్మెంట్‌కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్‌కే మెంటార్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ ఫేస్‌బుక్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వేచి చూడండి’ అని ధోనీ తన పోస్టులో పేర్కొన్నాడు. దాంతో ఫాన్స్ అందరూ అయోమయంలో పడిపోయారు. కెరీర్ చరమాంకంలో ఉన్న 42 ఏళ్ల ధోనీ.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవుతాడా? అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చినపుడు, పరిమిత ఓవర్లకు రిటైర్మెంట్ ఇచ్చినపుడు కూడా ధోనీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఏమైనా షాక్ ఇస్తాడేమేనని మహీ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా మరో కొద్ది రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
Also Read: Katrina Kaif Pregnant: తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్‌ను ఆరంభించింది. అయితే సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ఇంకా క్యాంప్‌లో చేరలేదు. ఆ మధ్య అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకు వెళ్లిన ధోనీ.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యాడు. మధ్యమధ్యలో యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే.. ఐపీఎల్‌కు మహీ గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ఇస్తే.. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.