NTV Telugu Site icon

Mohammed Shami: మహ్మద్‌ షమీని భర్తీ చేయడం కష్టమే: మోహిత్

Shami

Shami

Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్‌ మహ్మద్‌ షమీ లేకపోవడం గుజరాత్‌ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్‌, ఒమర్జాయ్‌ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్ చెప్పాడు. ఇటీవల చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు.

Also Read: MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?

మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదట చెన్నై 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఛేదనలో టైటాన్స్‌ 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. మ్యాచ్ అనంతరం మోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఏ జట్టుకైనా మొహ్మద్ షమీ లాంటి బౌలర్‌ పెద్ద బలం. షమీ లేని లోటును పూడ్చలేం. గాయాలను నియంత్రించడం చాలా కష్టం. అయితే వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లు స్పెన్సర్, ఒమర్జాయ్‌కు గుజరాత్‌ తరఫున ఇదే తొలి సీజన్. వారు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడే వారి నుంచి అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరికాదు. విజయాలు ముఖ్యమే కానీ.. మన ప్రణాళికలను అమలు చేస్తున్నామా? లేదా? అనేది కీలకం. పవర్‌ ప్లేలో పరుగులు రాబడితే ఏ జట్టుకైనా సానుకూలాంశమే’ అని అన్నాడు.