NTV Telugu Site icon

IPL 2024: కోహ్లీతో కలిసి బాబర్‌ ఆడితే.. పాక్‌ అభిమానికి హర్భజన్‌ కౌంటర్‌!

Harbhajan Singh

Harbhajan Singh

Harbhajan Singh Counter Pakistan Fan Over IPL 2024: భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్‌ అభిమాని తన మనసులోని కోరికను సోషల్‌ మీడియాలో బయటపెట్టాడు. పాక్‌ ఆటగాళ్లు భారత టీ20 టోర్నీలో ఆడితే చూడాలనుందని అతడు పేర్కొన్నాడు.

రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)లో విరాట్‌ కోహ్లీతో పాటు బాబర్‌ అజామ్‌ ఆడితే చూడాలని ఉందని పాక్‌ అభిమాని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అంతేకాదు షాహిన్‌ అఫ్రిదీ, జస్ప్రీత్ బుమ్రా కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడాలని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీతో మొహ్మద్ రిజ్వాన్‌ ఉంటే బాగుంటుందని తన కోరికల చిట్టాను వివరించాడు. ఇది భారత్‌, పాకిస్తాన్ క్రికెట్‌ అభిమానుల కల అంటూ పలు జెర్సీల్లో క్రియేట్‌ చేసిన ఫొటోలను పంచుకున్నాడు.

Also Read: RCB vs MI: స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం అద్భుతం: ఎలీస్‌ పెర్రీ

పాక్‌ అభిమాని ట్వీటుకు టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ‘భారతీయులెవరికీ అలాంటి కల లేదు. ముందుగా మీరు కలలు కనడం ఆపండి. మేల్కొనండి బాయ్స్‌’ అంటూ హర్భజన్‌ పాక్‌ అభిమానికి కౌంటర్‌ ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి సీజన్‌ (2008)లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధం విధించారు. ఐపీఎల్‌ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.

 

Show comments