Site icon NTV Telugu

IPL 2023 : పరాభవాలకు కారణమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్స్

Impact Players

Impact Players

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.. అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో వాడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు ఒక బ్యాటర్ ను వాడి ఆ తర్వాత రెండో ఇన్సింగ్స్ లో బౌలర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి. ఇక తొలుత బౌలింగ్ చేసే జట్లు బౌలర్ స్థానంలో మరో బ్యాటర్ కు ఛాన్స్ ఇస్తున్నాయి.

Also Read : Election Heat in YSRCP: వైసీపీలో ఎన్నికల హీట్.. కసరత్తు షురూ..!

కానీ ఢిల్లీ-లక్నో తో మ్యాచ్ లో లక్నో టీమ్ అయూష్ బధోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్ ను తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా చేస్తే ఒక జట్టులో బ్యాటింగ్ కు వచ్చేది 12 మంది అవుతారు కదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతంది. ఈ చర్చ కాసేపు పక్కనబెడితే.. అసలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్న వారు (ముఖ్యంగా బౌలర్లు) ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు.. గడిచిన ఐదు మ్యాచ్ లలో ఈ రూల్ వల్ల టీమ్ లు లాభపడ్డాయా.. అంటే లేదు అనే సమాశానాలు వస్తున్నాయి.

Also Read : Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం

ఈ లీగ్ లో సీఎస్కే-గుజరాత్ మ్యాచ్ లో అంబటి రాయుడి స్థానంలో తుషార్ దేశ్ పాండే వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తొలి క్రికెటర్ అతడే. కానీ తుషార్ వల్ల చెన్నె కంటే గుజరాత్ ఎక్కువగా లాభపడింది. తుసార్ 3.2 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు. తీసింది ఒక్క వికెట్ మాత్రమే.. పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ లో భానుక రాజపక్స స్థానంలో వచ్చిన రిషి ధావన్.. ఒక్క ఓవర్ వేసి 15 పరుగులు సమర్పించుకున్నాడు. శనివారం, ఆదివారం జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా ఇంపాక్ట్ బౌలర్లు విఫలమయ్యారు. రాజస్థాన్-సన్ రైజర్స్ మ్యాచ్ లో పడిక్కల్ స్థానంలో వచ్చిన నవ్ దీప్ సైనీ 2 ఓవర్లు వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై ఆర్సీబీ మ్యాచ్ లో ఎంఐ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జేసన్ బెహ్రండార్ఫ్.. 3 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చుకున్నాడు.

Also Read : Girl fight with boys : అబ్బాయిలకు బుద్ధి చెప్పిన లేడీ బ్రూస్లీ

వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మ్యాచ్ గతిని మార్చాలి. మ్యాచ్ లో సదరు ఆటగాడి ప్రభావం కచ్చితంగా ఉండాలి. బ్యాటింగ్ కు గానీ బౌలింగ్ కు గానీ వచ్చిన ఆటగాడు. మ్యాచ్ లో కాస్తో.. కూస్తో ప్రభావం చూపాలి.. కానీ గడిచిన ఐదు మ్యాచ్ లలో ఏమాత్రం ప్రభావం చూపని ప్లేయర్లు ఇంపాక్ట్ ఆటగాళ్లుగా వచ్చారు. ఈ ఇంపాక్ట్ బౌలర్లు మొత్తంగా 9.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 137 పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ లలో ప్రభావం చూపించకపోగా తమ జట్ల పరాభవాలకు కారణమవుతున్నారు. తొలి మ్యాచ్ లో చెన్నై ఓటమికి తుషార్ చెత్త బౌలింగ్ ప్రధాన కారణం. నిన్న ముంబై మ్యాచ్ లో బౌలర్ జెసన్ కూడా భారీగా పరుగులిచ్చి జట్టు ఓటమిలో భాగమయ్యాడు. మరీ రాబోయే మ్యాచ్ లలో అయినా జట్లు ఈ నిబంధనను సక్రమంగా వాడుకుంటాయో లేదో చూడాలి..

Also Read : AP Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు.. ఇలా స్పందించిన రోజా, అంబటి

అయితే బౌలర్ల పరిస్థతి ఇలా ఉంటే మరో వైపు బ్యాటర్లు కూడా అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయడం లేదు. తొలి మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ 22 పరుగులు చేశాడు. కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ పంజాబ్ మ్యాచ్ లో 28 బంతుల్లో 34 రన్స్ చేశాడు. సన్ రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్( 34) ఫర్వలేదనిపించాడు.

Exit mobile version