మార్చి 31న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2023) క్రికెట్ టోర్నమెంట్‌కు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. అయితే.. ఈ మేరకు హైదరాబాద్ లో త్వరలో ప్రారంభం కానున్నా ఐపీఎల్ -2023 సీజన్ ఏర్పట్లను సన్ రైజర్స్ యాజమాన్యంతో గురువారం నేరేడ్మెట్ ఆఫీస్ లో రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సమీక్షించారు.
Also Read : Bribe: లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఇంట్లో రూ.6కోట్లు లభ్యం
హైదరాబాద్‌లోని అన్ని మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. RGISలో ఏప్రిల్ 2న జరగనున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఐపీఎల్-2023 ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశంలో పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగే మ్యాచ్‌లకు అవసరమైన అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ అధికారులను ఆదేశించారు. టిక్కెట్ల పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ సీఈవో షణ్ముగాం, మల్కాజ్ గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Gopichand: కన్నడ స్టార్ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా షురూ…
