Site icon NTV Telugu

IPL 2023 : బట్లర్​ హాఫ్​ సెంచరీ.. చెన్నై టార్గెట్​176 పరుగులు

Csk

Csk

IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్​కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్ ఇన్నింగ్స్​పూర్తయింది. ఈ మ్యాచులో 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్​ రాయల్స్ 175 పరుగులు సాధించింది. తన ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్​బ్యాట్స్ మెన్ లలో జోస్​బట్లర్​హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పడిక్కల్, అశ్విన్​రాణించగా.. కెప్టెన్​సంజూ నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో ఆకాశ్​ సింగ్​, తుషార్​ దేశ్​పాండే, జడేజా తలో రెండు వికెట్లు తీయగా.. మెయిన్​ అలీ ఒక వికెట్​ తీశాడు.

Read Also: IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్​ బట్లర్​మ్యాచ్ కి మంచి శుభారంభం ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభంలోనే రాజస్థాన్‌ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్‌ పడిక్కల్ (38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్​లో కెప్టెన్​సంజూ శాంసన్ జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్‌ వేసిన 15 ఓవర్‌లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్​రౌండర్​అశ్విన్‌ (30) ఇదే ఓవర్‌లో చివరి బంతికి మగాలాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Read Also: IPL 2023 : చరిత్ర సృష్టించిన ధోని.. సీఎస్‌కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌

ఓపెనర్​గా వచ్చి దుమ్మురేపిన బట్లర్​ ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్‌ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్​ జురెల్​.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్​ సింగ్​ బౌలింగ్​లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్​ హోల్డర్, జంపా డకౌట్​గా పెవిలియన్​ చేరారు. హెట్​ మెయర్​(30*) ​నాటౌట్​గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్​ 175 పరుగులు సాధించింది.

Exit mobile version