NTV Telugu Site icon

iPhone 16 In India: నేటి నుండే భారత్ లో ఐఫోన్ 16 అమ్మకాలు.. క్రేజ్ మాములుగా లేదుగా..

Iphone

Iphone

iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రజల్లో అత్యుత్సాహం కనిపిస్తోంది. సేల్ ప్రారంభమైన వెంటనే ముంబైలోని యాపిల్ స్టోర్ వెలుపల పెద్ద క్యూలు కనిపించాయి. అర్ధరాత్రి నుంచే దుకాణం ముందు ప్రజలు బారులు తీరారు. దుకాణం దగ్గర లైన్లలో నిలబడేందుకు జనం పరుగులు తీశారు.

Weekend OTT Movies: ఈ వీకెండ్‌కు 24 సినిమాలు.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే!

ముంబైలోని యాపిల్ స్టోర్ బయట తొక్కిసలాట లాంటి పరిస్థితి కనిపించింది. ఇందుకు సంబంధించి అక్కడ ఓ వ్యక్తి మాట్లాడుతూ.. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని., స్టోర్ బయట చాలా సేపు నిలబడి ఉన్నానని., నేను 21 గంటలు ఇక్కడ ఉన్నానని చెప్పుకొచ్చాడు. స్టోర్‌ లోకి ప్రవేశించిన మొదటి వ్యక్తిని నేనే… నిర్వహణ చాలా బాగుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. ముంబైలోని BKCలో ఉన్న స్టోర్ వెలుపల నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఈ ఫోన్‌కు ముంబైలోని వాతావరణం పూర్తిగా కొత్తదని చెప్పాడు. గతేడాది కూడా 17 గంటల పాటు క్యూలో నిలబడ్డానని తెలిపాడు.

Viral Video: అరె బాబు.. పిల్లాడు అనుకున్నారా లేక తాడనుకున్నారా..?

Show comments