NTV Telugu Site icon

iPhone 15 Series Sale: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ స్టార్ట్.. యాపిల్ స్టోర్స్ ముందు భారీ క్యూలు! విమానంలో వచ్చి మరీ

Iphone 15 Gold

Iphone 15 Gold

A Man waited in line in front of Apple Store for 18 hours for iPhone 15: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ సెప్టెంబర్ 12న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్‌ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, యాపిల్ వెబ్‌సైట్ నుంచి 15 సిరీస్ లైనప్‌ను కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విక్రయాలు ఈరోజు నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్ అధికారిక వెబ్‌సైట్ సహా ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఫోన్‌ను బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 15 సిరీస్‌ కొనాలనుకునేవారు యాపిల్ స్టోర్స్ ముందు వేచి ఉన్నారు. కొన్నిచోట్ల భారీ క్యూలు కూడా ఉన్నాయి. ముంబైలోని యాపిల్‌ స్టోర్‌ బయట జనాలు పెద్ద క్యూలో నిలబడి ఉన్నారు. కొందరు 17 గంటలుగా క్యూలో నిలబడి ఉన్నారట. మరికొందరు ఐఫోన్ 15 కొనేందుకు పలు ప్రాంతాల నుంచి విమానంలో ముంబై చేరుకున్నారట.

Also Read: Mohali Pitch Report: భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే.. బ్యాటర్లకు పండగే! లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్

భారతదేశంలో మొదటి ఐఫోన్ 15 కొనాలని ఓ వ్యక్తి ముంబై బీకేసీలోని యాపిల్ స్టోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచే క్యూలో ఉన్నాడట. అతడు ఇప్పటివరకు 18 గంటలపాటు క్యూలో వేచి ఉన్నాడు. ఐఫోన్ 15 కొనడానికి అహ్మదాబాద్ నుండి ముంబై వచ్చాడట. బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఐఫోన్ 15 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడట. ఇదంతా చూస్తే భారతదేశంలో ఐఫోన్ 15 సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో యిట్టె తెలిసిపోతుంది.

Show comments