NTV Telugu Site icon

iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Iphone 15

Iphone 15

iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్‌ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను రిలీజ్ చేయడానికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఐఫోన్‌ 15 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సెప్టెంబర్ నెలను యాపిల్ కంపెనీ ఎంచుకుందట. కచ్చితమైన డేట్ మాత్రం ఇంకా తెలియరాలేదు.

iPhone 15 Price:
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లకు సంబంధించి చాలా లీక్‌లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అయితే ప్లస్ వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. లాంచ్ చేయడానికి ముందు ఐఫోన్ 15లో ఏ ఫీచర్లు ఉన్నాయో మరియు దాని ధర ఎంత ఉంటుందో ఓసారి చూద్దాం. ఐఫోన్ 15 ధర భారతదేశంలో దాదాపు రూ. 80,000 ఉంటుందని అంచనా. ఐఫోన్ 15 ప్రో ధర 200 డాలర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఐఫోన్ 15 ప్రో ధర 98,850గా ఉండనుంది. ఇక ప్రో మాక్స్ ధర దాదాపు రూ. 1,07,090లుగా ఉండే అవకాశం ఉంది. అయితే జిఎస్ష్టి, కస్టమ్ డ్యూటీలు మరియు ఇతర ఛార్జీల కారణంగా ప్రో మోడల్ భారతదేశంలో విడుదల కాదు.

Also Read: Varun Tej-Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వరుణ్‌-లావణ్యల తొలి ఫోటో.. నెట్టింట వైరల్‌!

iPhone 15 Specs:
15 సిరీస్‌ ఐఫోన్‌లలో గణనీయమైన మార్పు ఉండవచ్చు. యాపిల్ లైట్నింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్బీ టైప్-సి పోర్ట్‌ను ఉపయోగించవచ్చు. ఐఫోన్ 15 సిరీస్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అన్ని వేరియంట్‌లలో ఇది అందుబాటులో ఉండవచ్చు. లీక్‌లను ప్రకారం.. యాపిల్ పాత మ్యూట్ స్విచ్ బటన్‌ను కొత్త డిజైన్‌తో భర్తీ చేయవచ్చు. వాచ్ అల్ట్రా ఫీచర్ ప్రో మోడల్‌కు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది.

iPhone 15 Camera:
ఐఫోన్ 15 యాపిల్ యొక్క Bionic A16 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది 14 ప్రో మోడల్‌లో ఉపయోగించబడింది. 15 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లలో కంపెనీ కొత్త Bionic A17 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి యాపిల్ నుంచి వచ్చే అత్యంత ఖరీదైన ఫోన్‌లు. ఐఫోన్ 15 యొక్క సాధారణ వెర్షన్‌లు 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటాయి. ప్రస్తుత మోడల్‌లో అందుబాటులో ఉన్న 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే ఇది అప్‌గ్రేడ్ వెర్షన్.

Also Read: Reliance: రిలయన్స్‌కు ఫోర్బ్స్‌ గ్లోబల్‌ 2000 జాబితాలో 45వ స్థానం