‘యాపిల్ ఐఫోన్’ కొనాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. అయితే ఐఫోన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఆఫర్స్ అనంతరం ఐఫోన్ 15ను కేవలం రూ.25,000కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
సెప్టెంబర్ 2023లో ఐఫోన్ 15 విడుదలైంది. ఈ ఫోన్‌ను రూ.69,900కు యాపిల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 12 శాతం తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.60,999 ఐఫోన్ 15 లభిస్తుంది. అంటే ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.9,000 తగ్గింపును అందిస్తోంది. బ్యాంకు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అదనంగా రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. దాంతో ఐఫోన్ 15ను రూ.59,900కి కొనుగోలు చేయవచ్చు. అయితే మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను వాడుకోవచ్చు.
ఐఫోన్ 15పై రూ.46,950 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. మీ పాత ఐఫోన్ కండిషన్‌లో ఉంటేనే ఇంత మొత్తం లభిస్తుంది. ఒకవేళ మీకు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లభిస్తే.. 25 వేలకే ఐఫోన్ 15ను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇక ఐఫోన్ 15 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే ఉంటుంది. డైనమిక్ ఐలాండ్‌తో కూడిన నాచ్ డిస్‌ప్లే, 48 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. A16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి.