NTV Telugu Site icon

iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

Iphone 15 Pro Max

Iphone 15 Pro Max

iPhone 15 Series Launch and Discount Offers: సెప్టెంబర్ 12న జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు సెప్టెంబర్ 15న ఆరంభం కాగా.. ఈరోజు నుంచి భారత్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. యాపిల్ అధికారిక స్టోర్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా నేటి నుంచి ఈ ఫోన్ విక్రయించబడుతోంది.

iPhone 15 and iPhone 15 Plus Price in Inaia:
ఐఫోన్ 15 సిరీస్‌లో చౌకైన ఫోన్ ఐఫోన్ 15. ఈ స్మార్ట్‌ఫోన్‌ (128GB వేరియెంట్) ధర భారతదేశంలో రూ. 79,900గా ఉంది. 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 89,900 కాగా.. 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 1,09,900గా ఉంది. ఐఫోన్ 15 ప్లస్128GB వేరియంట్‌ ధర రూ. 89,900 కాగా.. 256GB వేరియంట్‌ ధర రూ. 99,900గా ఉంది. ఇక 512GB వేరియంట్‌ ధర రూ. 1,19,900లకు భారతదేశంలో అందుబాటులో ఉంది.

iPhone 15 Pro and iPhone 15 Pro Max Price in India:
ఐఫోన్‌ 15 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర భారతదేశంలో రూ. 1,34,900గా ఉండగా.. 256GB వేరియంట్‌ ధర రూ. 1,44,900గా ఉంది. ఇక ఐఫోన్‌ 15 ప్రో 512GB వేరియంట్‌ ధర రూ. 1,64,900 కాగా.. 1TB వేరియంట్‌ ధర రూ. 1,84,900గా ఉంది. ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ 256GB వేరియంట్‌ ధర రూ. 1,59,900 కాగా.. 512GB వేరియంట్‌ ధర రూ. 1,79,900గా ఉంది. ఇక 1TB వేరియంట్‌ ధర రూ. 1,99,900లకు అందుబాటులో ఉంది.

Also Read: iPhone 15 Series Sale: భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ స్టార్ట్.. యాపిల్ స్టోర్స్ ముందు భారీ క్యూలు! విమానంలో వచ్చి మరీ

iPhone 15 Launch Offers:
ఐఫోన్‌ 15 సిరీస్ కొనుగోళ్లపై అద్భుతమైన తగ్గింపు, లాంచ్ ఆఫర్‌లు ఉన్నాయి. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ లేదా యాపిల్ నుంచి ఈఎంఐ ఎంపికతో కొనుగోలు చేస్తే రూ. 5000 తగ్గింపు పొందవచ్చు. మరోవైపు ఐఫోన్‌ 15 ప్రో లేదా ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 6,000 తగ్గింపును పొందుతారు. వీటిపై మూడు లేదా ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. మరిన్ని ఆఫర్స్ కూడా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో ఉన్నాయి.

Show comments