NTV Telugu Site icon

iPhone 14 Pro Max Price Drop: బంపర్ ఆఫర్.. రూ. 40 వేలకే ఐఫోన్ 14 ప్రో మాక్స్!

iPhone 14 Pro Max Price Drop 2023: యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ అత్యంత ప్రీమియం మరియు ఎక్కువ మంది ఇష్టపడే ఫోన్. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందరూ కొనలేరు. ఇందుకు ప్రధాన కారణం.. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉండడమే. ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఖరీదుతో కూడుకున్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. అయితే యాపిల్ నుంచి 15 సిరీస్ వస్తువు నేపథ్యంలో ఈ ఫోన్ కొనుగోలుపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 40 వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇది చూడ్డానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఇదే నిజం.

ఎంజె సహాబ్ (MJ Sahab) అనే వినియోగదారు ఫేస్‌బుక్ మార్కెట్‌ ప్లేస్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేసాడు. యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫోన్‌ను రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చని అతడు పేర్కొన్నాడు. హోమ్ డెలివరీ ఎంపికను కూడా మనం ఎంచుకోవచ్చని చెప్పాడు. ఈ ఫోన్ ఒరిజినల్ బిల్లు కూడా అందించబడుతుందని అతడు చెప్పకొచ్చాడు. మీరు ఆన్‌లైన్‌లో ఈ వినియోగదారుని సంప్రదించవచ్చు. అయితే కొనేముందు ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఒరిజినల్ అవునా? కాదా? అని చెక్ చేసుకోవడం మంచిది. లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే 14 ప్రో మాక్స్.. ఇంత తక్కువకు ఎలా వస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Best Mileage Bike 2023: స్టైల్‌లోనే కాదు మైలేజ్‌లోనూ కింగే.. ఈ బైక్ ధర కేవలం 54 వేలు మాత్రమే!

యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్ రెటినా అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్‌తో వస్తుంది. కాబట్టి పనితీరు గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ యొక్క డిజైన్‌ అద్భుతంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఐఇందులో వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా హైలైట్‌గా ఉంటుంది. యాపిల్ ఫోన్స్‌లో తొలి 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఇదే. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ మరో రెండు కెమెరాలుగా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

యాపిల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఫ్రంట్ కెమెరా కోసం డిస్‌ప్లే టాప్‌లో పిల్ షేప్డ్ నాచ్ డిజైన్ ఉంది. ఇందులో పీక్ బ్రైట్‌నెక్ 2000 నిట్స్‌గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10కు ఇవి సపోర్ట్ చేస్తాయి. ఆల్‌వేస్ ఆన్‌ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ప్రధానమైన అప్‌గ్రేడ్‌. 4323 mAh బ్యాటరీ ఉంటుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ డీప్ పర్పుల్, గోల్డ్, సిల్వర్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి.

Also Read: Cheapest Electric Scooters: ధర 59 వేలు, 85 కిలోమీటర్ల ప్రయాణం.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!