Site icon NTV Telugu

Chandrababu: అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట.. చంద్రబాబుకు ఆహ్వానం

Chandrababu

Chandrababu

Chandrababu: ఈ నెల 22వ తేదీన అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది.. ఈ కార్యక్రమానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందుతున్నాయి.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సీనియర్‌ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు.. ఇలా చాలా మందికి ఆహ్వానలు అందుతున్నాయి.. ఇక, రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానాకి తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం వచ్చింది. ఈనెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో ప్రాణప్రతిష్ట వేడుక జరుగనుంది.. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు.. చంద్రబాబుకు ఆహ్వానం పంపించారు.

Read Also: IND vs AFG: మరొక్క విజయం.. అంతర్జాతీయ టీ20లో చరిత్ర సృష్టించనున్న భారత్‌!

కాగా, ఇప్పటికే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభించింది శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి సహాయం వివిధ రూపాల్లో అందుతూనే ఉంది.. ఈ నెల 21వ తేదీ వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరగబోతున్నాయి.. 18వ తేదీన ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచనున్నారు. 22వ తేదీ మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆరంభం కానుంది.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందుతోన్న విషయం విదితమే.

Exit mobile version