తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Also: Minister Kakani Govardhan Reddy: చంద్రబాబు అధికారం కోసం పనిచేశారు.. కానీ అభివృద్ధి కోసం కాదు..
కాగా.. దేశంలో మూడు ఐపీ అడ్రస్ ల నుంచి ఆపరేట్ అయినట్టు సైబర్ క్రైం అధికారులు గుర్తించారు. హాత్ వే, యాక్ట్ సహా మరో ఇంటర్నెట్ సర్వీసు ద్వారా గవర్నర్ ఖాతా హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు నిర్థారించారు. దీంతో.. ఐపీ అడ్రస్ వివరాలు ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను పోలీసులు కోరారు. కాగా.. వివరాలు అందగానే నిందితులను పట్టుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
Read Also: Raghunandan Rao: పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో వారందరూ పోటీ చేయాలి..