NTV Telugu Site icon

Fire Accident: నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరం

Fire Accident

Fire Accident

నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు. రమేష్ డిశ్చార్జ్ కాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. నేడు భవనాన్ని జేఎన్టీయూ ఇంజనీర్ బృందం పరిశీలించనుంది. అయితే, ఈ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందారు. తలా అనే యువకుడు 90 శాతం గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో సీరియస్ గా ఉన్నాడు.

Read Also: Rocking Rakesh: ‘కేసీఆర్’పై చేస్తున్న నా సినిమాని ఎలక్షన్ కమీషన్ ఆపేసింది

తలాతో పాటు మరో ఏడుగురికి ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ, సెట్ బ్యాక్ లేదని ఫైర్ అధికారులు తేల్చారు. పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్ లో కెమికల్స్ స్టోర్ చేశారని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. పాలిస్టర్ రెసిన్, బ్యానర్స్ కి వాడే సామగ్రి, ప్లాస్టిక్ మెటీరియల్, కెమికల్స్ ని రమేష్ జైస్వాల్ స్టోర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిన్న ఉదయం 9:30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 21 మందిని అగ్ని ప్రమాదంలో కాపాడారు.

Read Also: Cows Trample Devotees: ఆవులతో తొక్కించుకున్న భక్తులు.. కారణం ఏంటంటే?

అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఫైర్ శాఖ అధికారులు పేర్కొన్నారు. బిల్డింగ్ లో మొత్తం 16 ఇల్లులు ఉన్నాయి.. బిల్డింగ్ కి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు.. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ అసలే లేదు.. సెల్లార్ ను పార్కింగ్ కోసం వినియోగించాలి కానీ కెమికల్ డ్రమ్స్ పెట్టారు.. పాలిస్టర్ రెసిన్, బ్యానర్ లకు వాడే సామాగ్రి, కెమికల్స్ ను డంపు చేశారు అని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ఇక, భారీగా కెమికల్ నిల్వలు ఉంచినప్పుడు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అపార్ట్‌మెంట్‌ వాసులను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రశ్నించారు. దీంతో వారు ఆ ప్రశ్నలకు సైలెంట్ అయ్యారు. మరోవైపు తనిఖీలు చేపట్టని విజిలెన్స్‌ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో విఫలమైన జీహెచ్‌ఎంసీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.