NTV Telugu Site icon

Nuh Voilence: నుహ్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!

Nuh

Nuh

గత జూలైలో నుహ్‌లో జరిగిన హింసాకాండ.. ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే మరోసారి అలాంటి హింసలకు పాల్పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కారణమేంటంటే.. ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ ‘శోభా యాత్ర’ చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.

Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే

సోమవారం నిర్వహించే ఈ ర్యాలీ సమయంలో సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) టీవీఎస్ఎన్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ కూడా విధించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 26-28 వరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే

అంతేకాకుండా.. లైసెన్స్ పొందిన తుపాకులు, లాఠీలు, గొడ్డళ్లు ఇతర ఆయుధాలను ఎవరూ తీసుకెళ్లడానికి లేదని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా మత ఘర్షణలు చెలరేగడంతో నుహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జులై 31న నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు.

Rashmi Gautam: బాత్ టబ్లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు

మరోవైపు నుహ్ లో శోభా యాత్ర నేపథ్యంలో నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ప్రసాద్‌కు లేఖ రాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా/బల్క్ మెసేజ్‌లను దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీని కోరారు.