NTV Telugu Site icon

International Podcast Day 2024: నేడే అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే?

International Podcast Day 2024

International Podcast Day 2024

International Podcast Day 2024: నేటి డిజిటల్ యుగంలో పాడ్‌క్యాస్ట్‌లు వినడం సాధారణ విషయంగా మారింది. మీరు ప్రయాణంలో ఉన్నా, వ్యాయామం చేస్తున్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, పాడ్‌క్యాస్ట్‌లు వినోదం మరియు విద్యకు గొప్ప మూలంగా ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే, అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

Hyundai Record: అరుదైన మైలురాయిని అందుకున్న హ్యుందాయ్‌!

మీరు ఎప్పుడైనా రేడియోలో మీకు ఇష్టమైన పాటలు లేదా షోలను విన్నారా.? పోడ్‌కాస్ట్ కూడా అచ్చం ఇదే విధంగా ఉంటుంది. అయితే ఇందులో మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా మీకు నచ్చిన ఏదైనా షో లేదా కథనాన్ని వినవచ్చు. ఇది మీరు మీ మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా టాబ్లెట్‌లో డౌన్‌లోడ్ చేసి వినగలిగే ఆడియో ప్రోగ్రామ్ రకం. నిజానికి., పాడ్‌క్యాస్ట్ (Podcast) అనే పదం రెండు పదాలతో రూపొందించబడింది, ఇందులో POD అంటే డిమాండ్‌పై ప్లే చేయదగినదని అర్థం. అలాగే CAST అంటే బ్రాడ్‌కాస్ట్. ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయబడుతుందని అర్థం.

Hassan Nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన పైలెట్ కు ఘన స్వాగతం!(వీడియో)

అంతర్జాతీయ పాడ్‌క్యాస్ట్ దినోత్సవం ప్రాముఖ్యత విషయానికి వస్తే.. పోడ్‌కాస్టింగ్‌ను మాధ్యమంగా ప్రోత్సహించడానికి ఈ రోజు ఒక గొప్ప అవకాశం. ఇది కొత్త శ్రోతలను పాడ్‌క్యాస్ట్ వినడానికి ప్రోత్సహిస్తుంది. ఇంకా ఇప్పటికే ఉన్న శ్రోతలు తమకు ఇష్టమైన పాడ్‌క్యాస్ట్‌ లను వినడానికి, భాగస్వామ్యం చేయడానికి ప్రేరేపిస్తుంది. పోడ్‌కాస్ట్ నిర్మాతల కృషి, అంకితభావాన్ని గౌరవించే అవకాశం ఈ రోజు. పాడ్‌క్యాస్ట్‌లు అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి, కొత్త ఆలోచనలను అన్వేషించడానికి, ప్రపంచంపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి సహాయపడతాయి.

America – Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడి.. 37 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం!

పాడ్‌క్యాస్ట్‌లను వినడం ద్వారా పొందే ప్రయోజనాల విషయానికి వస్తే.. విభిన్న అంశాల గురించి తెలుసుకోవడానికి పాడ్‌క్యాస్ట్‌లు మీకు గొప్ప మార్గాన్ని అందిస్తాయి. ఇంకా మీరు పాడ్‌క్యాస్ట్‌లను వింటున్నప్పుడు వంట చేయడం, ప్రయాణం చేయడం లేదా వ్యాయామం చేయడం వంటి ఇతర పనులను చేయవచ్చు. అలాగే పాడ్‌క్యాస్ట్‌లను వినడం ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మంచి మార్గం. ఇంకా పాడ్‌క్యాస్ట్‌లు అనేక సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి సహాయపడతాయి. పాడ్‌క్యాస్ట్‌లను వినడానికి మీకు ప్రత్యేక పరికరాలు ఏవీ అవసరం లేదు. మీరు మీ మొబైల్ ఫోన్ నుండి మాత్రమే వినవచ్చు.

Show comments